
* కారణం ఇదే..
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి (Uttam Kumar reddy) ప్రయాణిస్తున్న హెలికాప్టర్ ను అత్యవసరంగా ల్యాండింగ్ చేయాల్సి వచ్చింది. వాతావరణ శాఖ సూచనల మేరకు పైలట్ ఈనిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. వాస్తవానికి ఆయన హెలికాప్టర్ మేళ్లచెరువు మండల కేంద్రంలో ల్యాండ్ అవ్వాల్సి ఉంది. భారీ వర్ష సూచన, గాలి దుమారం కారణంగా ముందు జాగ్రత్త చర్యగా పైలట్ అలర్ట్ అయినట్లు సమాచారం. సూర్యాపేట జిల్లా కోదాడలో హెలికాప్టర్ ను ల్యాండ్ చేశారు. హుజూర్ నగర్ మండలం మేళ్లచెరువులో ల్యాండ్ కావాల్సిన హెలికాఫ్టర్ ను వాతావరణ శాఖ సూచన మేరకు అత్యవసరంగా కోదాడలో ల్యాండింగ్ చేశారు.
………………………………………………..