* బెంగాల్‌ను అవమానించారని కేంద్రంపై ఆగ్రహం
* నీతి అయోగ్‌ను రద్దు చేయాలని డిమాండ్
ఆకేరు న్యూస్ డెస్క్ : రాష్ట్రపతి భవన్ (Rashtrapati Bhavan) లో జరుగుతున్న నీతి అయోగ్ సమావేశం (Niti Aayog meeting) నుంచి పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ (West Bengal Chief Minister Mamata Banerjee) వాకౌట్ (Walkout)చేశారు. తనను ఐదు నిమిషాలు కూడా మాట్లాడకుండా మైక్ కట్ చేశారని, ఇది పశ్చిమ బెంగాల్ ప్రజలను అవమానించడమేనని తీవ్రంగా విమర్శించారు. బయటకు వచ్చిన తర్వాత మీడియాతో మాట్లాడిన మమత కేంద్రం తీరుపై విరుచుకుపడ్డారు. బీజేపీ (BJP) రాష్ట్రాలకు సమావేశంలో చాలా సమయం ఇచ్చారని తెలిపారు. విపక్ష రాష్ట్రాల నుంచి తానొక్కరినే సమావేశానికి వచ్చానని, తనకు మాట్లాడే సమయం ఇవ్వకపోవడం ప్రాంతీయ పార్టీలను అవమానించడమేనని చెప్పారు. తాను మాట్లాడుతుంగానే మైక్ కట్ చేశారన్నారు. ఇది కేవలం పశ్చిమ బెంగాల్ (West Bengal ) కు సంబంధించిన అంశం కాదని, బడ్జెట్ రాజకీయంగా మారిపోయిందని ఆరోపించారు. ప్రతిపక్షాలు (Oppositions) పాలిస్తున్న రాష్ట్రాలకు నిధులు ఇవ్వలేదన్నారు. నీతి అయోగ్‌ను రద్దు చేసి ప్లానింగ్ కమిషన్ (Planning Commission) తేవాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రధాని నరేంద్ర మోదీ (Prime Minister Narendra Modi) అధ్యక్షతన నీతి ఆయోగ్ 9వ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశం (9th Governing Council Meeting) జరుగుతోంది. సమావేశంలో వివిధ రాష్ట్రాల ముఖ్యమంత్రులు (Chief Ministers), కేంద్ర పాలిత ప్రాంతాల లెఫ్టినెంట్ గవర్నర్లు (Lieutenant Governors of Union Territories), కేంద్ర మంత్రులు (Union Ministers), ప్రత్యేక ఆహ్వానితులు, నీతి ఆయోగ్ వైస్ చైర్మన్ (Vice Chairman of NITI Aayog), సభ్యులు పాల్గొన్నారు.
——————