Station Ghanpur financial stress death
*ఆర్థిక ఇబ్బందులతో వ్యక్తి ఆత్మహత్య
ఆకేరు న్యూస్, స్టేషన్ ఘన్ పూర్
ఆర్థిక ఇబ్బందులు తట్టుకోలేక గట్టు వెంకటస్వామి (50) అనే వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన జనగామ జిల్లా స్టేషన్ ఘన్ పూర్ డివిజన్ కేంద్రంలో మంగళవారం జరిగింది. మృతుడి భార్య గట్టు శ్రీవాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి…. మృతుడు గట్టు వెంకటస్వామి స్టేషన్ రోడ్డులోని తన సొంత ఇంటిలో బట్టల వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో గత కొద్ది నెలలుగా వ్యాపార లావాదేవీలు సక్రమంగా నడవకపోవడంతో ఇంటిలోనూ, క్రెడిట్ కార్డ్ పై తెచ్చిన లోన్ ఈఎంఐలు చెల్లించడం కష్టంగా మారిందని కుటుంబ సభ్యులతో చెప్పినట్లు ఆమె పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. నాలుగు రోజుల కిందట తాను బంధువుల ఇంటికి వెళ్లానని భర్త, కొడుకు మాత్రం ఇంటి వద్దగా ఉన్నారని ఈ క్రమంలో నెలవారి ఈఎంఐలు చెల్లించడం ఎలా అని తీవ్రంగా ఆలోచించి తీవ్ర మనస్థాపానికి గురై ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు ఫిర్యాదులు పేర్కొన్నారు. మృతుడికి భార్య, కుమారుడు, కూతురు ఉన్నారు. మృతుడి భార్య శ్రీ వాణి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
