
* భర్త పట్ల మృగాళ్లా మారిన ఇద్దరు భార్యలు
ఆకేరున్యూస్, సూర్యాపేట : భర్తను కంటికి రెప్పలా చూసుకోవాల్సింది పోయి.. ఇద్దరు భార్యలు కలిసికట్టుగా అతడిని కడతేర్చారు. ఈ దారుణ ఘటన చివ్వెంల మండలం గుర్రంతండాలో చోటు చేసుకుంది. సూర్యాపేట జిల్లా చివ్వెంల మండలం గుర్రంతండాకు చెందిన ఓ వ్యక్తికి ఇద్దరు భార్యలు ఉండగా.. భర్తపై కక్ష పెంచుకున్న భార్యలు.. అతన్ని గుట్టుచప్పుడు కడతేర్చారు. ఈ ఘటనపై స్థానికులు పోలీసులను అప్రమత్తం చేయగా.. పోలీసులు హుటాహుటిన ఘటనాస్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితులను అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
……………………………..