
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మూడు రోజులుగా విస్తారంగా కురుస్తున్న వర్షాలు రైల్వే వ్యవస్థపై ప్రభావం చూపుతున్నది. వర్షాల వల్ల పలు చోట్ల రైల్వే లైన్లు ధ్వసం అయ్యాయి. ఇంకొన్ని చోట్ల పట్టాలపై నీరు ప్రవహిస్తోంది. మంగళవారం 28 రైళ్లను రద్దు చేసినట్లు అధికారులు ప్రకటించారు. మరో 24రైళ్లను దారిమళ్లించారు. రైల్వే ట్రాకట్ లు దెబ్బతినడం వల్ల రైళ్లను రద్దు చేసినట్లు ప్రకటించారు. వాతావరణం అనుకూలిస్తే రైళ్ల రాకపోకలు యథావిధిగా కొనసాగిస్తామని రైల్వే అధికారులు వెల్లడించారు.