– ఆయా జిల్లా కలెక్టర్లను అప్రమత్తం చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆకేరున్యూస్, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలోని 11 జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో విజయవాడ, తెలంగాణ లోని ఖమ్మం జిల్లాలో పలు ప్రాంతాలు వరదల్లో చిక్కుకున్నాయి. ఈ నేపథ్యంలో మరో మూడు నాలుగు రోజులు రెండు తెలుగు రాష్ట్రాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాల పడతాయని వాతావరణ శాఖ తెలపడంతో ముఖ్యంగా వరద ముంపు ప్రాంతాల ప్రజలకు కంటి మీద కునుకు లేకుండా పోయింది. తెలంగాణ రాష్ట్రంలోని అన్ని జిల్లాల ప్రజలు వర్షాల కారణంగా ఇబ్బంది పడుతున్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు వారి ఇళ్లలోకి నీరు చేరుకుని, ఇంట్లో సమగ్రి, ఆహార పదార్థాలు పాడైపోవడంతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. 11జిల్లాల్లో భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ హెచ్చరించింది. దీంతో ఆయా జిల్లాల కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని ప్రభుత్వం ఆదేశించింది. భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో ఆదిలాబాద్, జగిత్యాల, కామారెడ్డి, కుమురంభీం ఆసిఫాబాద్, మెదక్, మేడ్చల్ మల్కాజ్గిరి, నిర్మల్, నిజామాబాద్, పెద్దపల్లి, సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాల కలెక్టర్లును ప్రభుత్వం అప్రమత్తం చేసింది.