* స్థానిక ఎన్నికల నేపథ్యంలోనా?
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఇటీవలే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను బదిలీ చేసిన కాంగ్రెస్ సర్కార్ తాజాగా మున్సిపల్ కమిషనర్లకు (Municipal Commissioners) ప్రమోషన్లు ఇవ్వడంతోపాటు ఎక్కువ మందికి స్థానచలనం కల్పించింది. ఒకేసారి 129 మంది మున్సిపల్ కమిషనర్లను బదిలీ చేస్తూ మున్సిపల్ కార్యదర్శి డాక్టర్ టీకే శ్రీదేవి ఆదేశాలు జారీచేశారు. ఈ ఆదేశాలు వెంటనే అమల్లోకి వస్తాయని వెల్లడించారు. వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్(Warangal Municipal Corporation)లో డిప్యూటీ కమిషనర్‌గా పనిచేస్తున్న టీ రాజేశ్వర్‌ను మహబూబాబాద్ కమినషర్‌గా బదిలీచేశారు. రాష్ట్రంలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి సిద్ధం అవుతున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే అధికారుల బదిలీలు చేపడుతున్నట్లు తెలుస్తోంది.
……………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
