* రియల్ ఎస్టేట్ వ్యాపారంలో చురుగ్గా ఉండే అనిల్
* కడపకు చెందిన ఎమ్మెల్యే తో అనిల్ ఆర్థిక లావాదేవీలు..?
ఆకేరు న్యూస్ మెదక్ : మెదక్ జిల్లా కొల్చారం మండలం పైతర గ్రామానికి చెందిన కాంగ్రెస్ ఎస్సీ సెల్ సెక్రటరీ మారెల్లి అనిల్ (35)ను గుర్తు తెలియని వ్యక్తులు హత్య చేశారు. అనిల్ మృత దేహం గ్రామానికి సమీపంలో కారులో పడి ఉంది. హైదరాబాద్ గాంధీ భవన్ లో పార్టీ కార్యక్రమాలు చూసుకొని తిరిగి వస్తూండగా ఈ హత్య జరిగింది. అనిల్ ను వెంటాడిన దుండగులు గ్రామసమీపానికి చేరుకోగానే దాడి చేశారు. భయంతో పరుగులు తీసిన అనిల్ పై కాల్పులు జరిపినట్లు సమాచారం.
రియల్ దందాలే కారణమా..?
అనిల్ రియల్ ఎస్టేట్ వ్యాపారాల్లో చురుగ్గా పాల్గొనేవాడని సమాచారం. కడపకు చెందిన ఓ ఎమ్మెల్యేతో అనిల్ కు భూ వివాదాలు ఉన్నట్లు సమాచారం. ఆ ఎమ్మెల్యే కుటుంబంతో ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిసింది.. అనిల్ హత్య కేసును దర్యాప్తు చేస్తున్న పోలీసులు అనిల్ భూ వివాదాలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం..
………………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
