Minister Adluri Challenge Harish Rao
* రూ. 2 వేల కోట్ల స్కాం నిరూపిస్తే రాజీనామా చేస్తా..
ఆకేరు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాజకీయాల్లో మరోసారి సవాళ్లు, ప్రతిసవాళ్ల పర్వం హీటెక్కించింది. తన శాఖలో రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందంటూ బీఆర్ఎస్ సీనియర్ నేత, మాజీ మంత్రి హరీష్రావు చేసిన ఆరోపణలపై మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తీవ్రంగా స్పందించారు.
ఈ ఆరోపణలను నిరూపిస్తే క్షణాల్లో తన మంత్రి పదవికి రాజీనామా చేయడానికి సిద్ధమని ఆయన బహిరంగ సవాల్ విసిరారు.
మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడిన మంత్రి అడ్లూరి లక్ష్మణ్.. హరీష్రావు వ్యాఖ్యలపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. ఆధారాలు లేకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేలా మాట్లాడటం సరికాదని హితవు పలికారు.
* ఏ వేదికకైనా నేను సిద్ధం..
“రూ.2 వేల కోట్ల స్కాం జరిగిందని మీరు ఆరోపిస్తున్నారు. దీనిపై చర్చించడానికి ఎక్కడికి రావాలో, ఏ వేదికపై చర్చించాలో మీరే చెప్పండి. నేను, నా శాఖ అధికారులు అందరం రావడానికి సిద్ధంగా ఉన్నాం. మీరు చేసిన ఆరోపణలను ఆధారాలతో సహా నిరూపించండి” అని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ స్పష్టం చేశారు.
* రాజకీయ సన్యాసానికి సిద్ధమా..
స్కాం జరిగిందని నిరూపిస్తే తాను వెంటనే మంత్రి పదవికి రాజీనామా చేస్తానని ప్రకటించిన ఆయన.. ఒకవేళ ఆరోపణలు నిరూపించలేకపోతే రాజకీయాల నుంచి వైదొలగేందుకు హరీష్రావు సిద్ధమా? అని సవాల్ విసిరారు. కేవలం రాజకీయ ఉనికి కోసమే ఇలాంటి నిరాధారమైన ఆరోపణలు చేస్తున్నారని దుయ్యబట్టారు. వాస్తవాల ఆధారంగా ఎప్పుడైనా, ఎక్కడైనా చర్చకు తాము సిద్ధంగా ఉన్నామని మంత్రి అడ్లూరి లక్ష్మణ్ తేల్చిచెప్పారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
