Malayalam OTT Hit Dridam Movie Review
* ఓటీటీలో సైలెంట్‌గా దూసుకెళ్తున్న క్రైమ్ థ్రిల్లర్
ఆకేరు న్యూస్, డెస్క్ : ఓటీటీలో ప్రతి వారం ఎన్నో సినిమాలు విడుదలవుతుంటాయి. కానీ వాటిలో కొన్ని మాత్రమే ప్రేక్షకుల దృష్టిని ఆకర్షిస్తాయి. ఎలాంటి హడావిడి లేకుండా జియో హాట్‌స్టార్‌లో స్ట్రీమింగ్కు వచ్చిన మలయాళ క్రైమ్ థ్రిల్లర్ ‘ధృడం’ ఇప్పుడు థ్రిల్లర్ ప్రేమికుల మధ్య చర్చనీయాంశంగా మారుతోంది.
సస్పెన్స్ కథలు, పోలీస్ ఇన్వెస్టిగేషన్ డ్రామాలను అద్భుతంగా తెరకెక్కించడంలో మలయాళ చిత్రసీమకు ప్రత్యేక గుర్తింపు ఉంది. అదే తరహాలో తెరకెక్కిన ‘ధృడం’ కూడా మొదట సాధారణ కథలా కనిపించినా.. కథ ముందుకు సాగే కొద్దీ ప్రేక్షకులను పూర్తిగా తన ప్రపంచంలోకి లాక్కెళ్తుంది.
* ప్రశాంతమైన ఊరిలో మొదలైన మిస్టరీ..
కొత్తగా ఎస్సైగా బాధ్యతలు చేపట్టిన విజయ్ అనే యువ అధికారి ఓ ప్రశాంతమైన ప్రాంతానికి బదిలీపై వస్తాడు. పెద్దగా నేరాలు లేని ఆ ప్రాంతంలో అతనికి అంతా సాధారణంగానే కనిపిస్తుంది. కానీ కొద్ది రోజులకే వరుసగా జరుగుతున్న అనుమానాస్పద ఘటనలు, హత్యలు, దొంగతనాలు అతని ముందుకు వస్తాయి.
ఒక్కో కేసు విచారణ ముందుకు సాగుతున్న కొద్దీ కొత్త ప్రశ్నలు తలెత్తుతాయి. ఊరిలో ఎవరిని నమ్మాలి? ఎవరిని అనుమానించాలి? అనే సందిగ్ధత కథను మరింత ఆసక్తికరంగా మారుస్తుంది.
* చివరి ట్విస్టులు ఊహించలేరు!
ఈ సినిమా బలం దాని కథనం. తొలిభాగంలో దర్శకుడు పాత్రలను, పరిసరాలను నెమ్మదిగా పరిచయం చేస్తాడు. మొదట్లో సాధారణంగా కనిపించే కొన్ని సన్నివేశాలు, పాత్రలు రెండో భాగంలో కథకు ఎంత కీలకమో అప్పుడు అర్థమవుతుంది.
ముఖ్యంగా క్లైమాక్స్‌కు ముందు వచ్చే మలుపులు ప్రేక్షకులను ఆశ్చర్యపరుస్తాయి. చివరి 20 నిమిషాలు సినిమా మొత్తానికి హైలైట్‌గా నిలుస్తాయి.
* షేన్ నిగమ్ నటన ఆకట్టుకుంటుంది
ఎస్సై విజయ్ పాత్రలో షేన్ నిగమ్ తన సహజ నటనతో మెప్పించాడు. ఓ యువ పోలీస్ అధికారి ఎదుర్కొనే ఒత్తిడి, అయోమయం, బాధ్యతలను తెరపై బాగా చూపించాడు. మిగతా పాత్రలు కూడా కథకు అవసరమైన బలం అందించాయి.
* థ్రిల్లర్ ఫ్యాన్స్‌కు ట్రీట్!
వేగంగా సాగే కమర్షియల్ సినిమా కాకుండా, ఓపికగా చూసే క్రైమ్-సస్పెన్స్ థ్రిల్లర్ కావాలనుకుంటే ‘ధృడం’ మంచి ఎంపిక. ముఖ్యంగా చివరి వరకు ఏమి జరుగుతుందో ఊహించలేని కథలను ఇష్టపడేవారికి ఈ సినిమా నచ్చే అవకాశాలు ఎక్కువ.
జియో హాట్‌స్టార్‌లో ప్రస్తుతం స్ట్రీమింగ్ అవుతోంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
