ఆకేరున్యూస్, హైదరాబాద్: హన్మకొండ, వరంగల్ జిల్లాల పర్యటనలో భాగంగా బుధవారం ఎన్ఐటీ గెస్ట్ హౌస్ కు చేరుకున్న తెలంగాణ రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మకు వరంగల్ జిల్లా ఇంచార్జి మంత్రి, రాష్ట్ర రెవెన్యూ, హౌసింగ్, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి పుష్పగుచ్ఛం అందించి ఘనస్వాగతం పలికారు. అనంతరం ఆయనను శాలువాతో సన్మానించారు. హన్మకొండ కలెక్టర్ ప్రావీణ్య మొక్కను అందజేసి స్వాగతం పలికారు. ఈ సందర్భంగా గవర్నర్ పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. కార్యక్రమలో ఉమ్మడి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ బండా ప్రకాష్, రాష్ట్ర ఫైనాన్స్ కమిషన్ చైర్మన్ సిరిసిల్ల రాజయ్య, గ్రేటర్ వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్సీలు కడియం శ్రీహరి, బస్వరాజు సారయ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, గండ్ర సత్యనారాయణ, కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామి రెడ్డి, హన్మకొండ, వరంగల్ జిల్లా కలెక్టర్లు ప్రావీణ్య, డాక్టర్ సత్య శారద, జీడబ్ల్యూ ఎంసీ కమిషనర్ డాక్టర్ అశ్వినీ తానాజీ వ్యాఖడే, డీఎఫ్ వోలు అనుజ్ అగర్వాల్, లావణ్య, ఎన్పీడీసీఎల్ సీఎండీ వరుణ్ రెడ్డి, అదనపు కలెక్టర్ సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు.
పుష్పగుచ్ఛం అందించిన సీపీ
హనుమకొండ, వరంగల్ జిల్లా పర్యటనలో భాగంగా నిట్ కళాశాల అతిథి భవనానికి చేరుకున్న రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మను వరంగల్ పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు.
———————————————-