– వరదబాధితుల కోసం సహాయ కార్యక్రమానికి వెళ్తుండగా ఘటన
– విశ్రాంతి తీసుకోవాలని చెప్పిన వైద్యులు
ఆకేరున్యూస్, ఖమ్మం: రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా రాష్ట్ర ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వరద పోటెత్తింది. జల దిగ్బంధంలో చిక్కుకున్న ప్రజలను రక్షించేందుకు సహాయ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు బైక్ పై వెళ్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస రెడ్డి అదుపుతప్పి కిందపడి గాయపడ్డారు. కాలుకు దెబ్బ తగలడంతో వెంటనే సహాయకులు ఇంటికి తరలించి చికిత్స అందించారు. గాయాన్ని పరిశీలించిన వైద్యులు విశ్రాంతి తీసుకోవాలని సూచించారు.