Yashaswini Reddy NEET Protest
ఆకేరు న్యూస్, పాలకుర్తి :
నీట్ (NEET) పరీక్షల్లో జరిగిన అక్రమాలకు వ్యతిరేకంగా, భవిష్యత్తు కోసం శాంతియుతంగా నిరసన తెలుపుతున్న విద్యార్థులపై కేంద్ర బలగాలు జరిపిన లాఠీఛార్జ్ మరియు దౌర్జన్యాలను పాలకుర్తి శాసనసభ్యురాలు మామిడాల యశస్విని రెడ్డి తీవ్రంగా ఖండించారు.
* ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ
”దేశానికి వెన్నెముక లాంటి విద్యార్థుల భవిష్యత్తును నీట్ పరీక్షా పత్రాల లీకేజీతో కేంద్ర ప్రభుత్వం తీవ్రంగా దెబ్బతీసిందని న్యాయం చేయాలని రోడ్డెక్కిన విద్యార్థులపై కేంద్ర బలగాలను ఉపయోగించి భౌతిక దాడులకు పాల్పడటం అత్యంత హేయమైన చర్య. విజ్ఞప్తి చేస్తున్న విద్యార్థుల గొంతు నొక్కడం
* ప్రజాస్వామ్యానికే గొడ్డలిపెట్టు.”
విద్యార్థులపై మోపిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలి.
దాడికి పాల్పడిన బాధ్యులైన అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలి.
నీట్ పరీక్షల లీకేజీపై పూర్తిస్థాయి నిష్పాక్షిక విచారణ జరిపి, అభ్యర్థులందరికీ తగిన న్యాయం చేయాలి.
విద్యార్థుల వైపు తమ ప్రభుత్వం, పార్టీ ఎల్లవేళలా అండగా ఉంటాయని, బాధితులకు న్యాయం జరిగే వరకు పోరాటం కొనసాగిస్తామని ఈ సందర్భంగా ఆమె స్పష్టం చేశారు.
