Minister Seethakka MD Tajuddin Mulugu Minority Cell President
ఆకేరు న్యూస్, ములుగు:
కాంగ్రెస్ పార్టీ ములుగు జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడిగా ఏటూరునాగారం మండల కేంద్రానికి చెందిన ఎండీ తాజుద్దీన్ ను మంత్రి సీతక్క అధికారికంగా ప్రకటించారు.
ఈ సందర్భంగా మంత్రి సీతక్క , ములుగు డీసీసీ అధ్యక్షులు పైడాకుల అశోక్ లు నూతన జిల్లా మైనారిటీ సెల్ అధ్యక్షుడు ఎండీ తాజుద్దీన్ నుశాలువాతో సన్మానించి అభినందనలు తెలిపారు, పార్టీ అభివృద్ధి కోసం సమర్థవంతంగా పనిచేయాలని ఆకాంక్షించారు.
తాజుద్దీన్ మాట్లాడుతూ తనపై నమ్మకం ఉంచి మైనారిటీ జిల్లా అధ్యక్ష బాధ్యతలు అప్పగించినందుకు మంత్రి సీతక్క, జిల్లా అధ్యక్షులు పైడాకుల అశోక్, ములుగు గ్రంథాలయ చైర్మన్ భానోత్ రవిచందర్, జిల్లా, మండల, పార్టీ అధిష్ఠానానికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, కాంగ్రెస్ పార్టీ బలోపేతం కోసం నిబద్ధతతో కష్టపడతానని ఆయన తెలిపారు.
ఈ కార్యక్రమంలో జిల్లాలోని, పలు మండల, గ్రామాల నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
