Seethakka Congress Leaders Meeting Mulugu
* ప్రభుత్వ పథకాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలి
ఆకేరు న్యూస్, ములుగు:
ములుగు జిల్లా, ములుగు మండలంలోని ఇంచర్ల ఎం ఆర్ గార్డెన్ లో కాంగ్రెస్ పార్టీ జిల్లా స్థాయి ముఖ్య నాయకుల సమావేశం ములుగు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పైడాకుల అశోక్ అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమానికి రాష్ట్ర మంత్రి ధనసరి అనసూయ (సీతక్క) ముఖ్య అతిథిగా హాజరై నాయకులకు, కార్యకర్తలకు దిశానిర్దేశం చేశారు.
* సమావేశంలో మంత్రి మాట్లాడుతూ..
కష్టపడే వారికి గుర్తింపు ఉంటుందని, పార్టీలోని ప్రతి నాయకుడు తమ పరిధిలో నిబద్ధతతో, కష్టపడి పని చేయాలని సూచించారు. పార్టీ కోసం శ్రమించే ప్రతి ఒక్కరికీ సరైన సమయంలో తగిన గుర్తింపు, గౌరవం తప్పక లభిస్తుందని మంత్రి భరోసా ఇచ్చారు.
ఎన్నికలు, పార్టీ నిర్మాణం లో బూత్ ఏజెంట్ల వ్యవస్థ చాలా కీలకమైనదని,బాధ్యతాయుతంగా వ్యవహరించి పార్టీ బలోపేతానికి విశేష కృషి చేయాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న వివిధ సంక్షేమ, అభివృద్ధి పథకాలను క్షేత్ర స్థాయిలో ప్రతి గడపకూ తీసుకెళ్లాల్సిన బాధ్యత నాయకులపైనే ఉందని స్పష్టం చేశారు.
పార్టీ అభివృద్ధి కోసం పాత, కొత్త నాయకులు, కార్యకర్తలు అందరూ సమన్వయంతో ఒకే తాటిపై నడిచి ములుగు జిల్లాలో కాంగ్రెస్ పార్టీని మరింత పటిష్టం చేయాలని ఆమె ఉద్బోధించారు.సమావేశంలో ములుగు జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ బానోత్ రవిచందర్, వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ రేగా కళ్యాణి తో పాటు కాంగ్రెస్ పార్టీ జిల్లా, మండల స్థాయి నాయకులు, డైరెక్టర్లు, ప్రజా ప్రతినిధులు, సీనియర్ నాయకులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
