Mulugu Seethakka Financial Aid
* రోడ్డు ప్రమాదంలో గాయపడిన దాసరి సుధాకర్‌కు ₹50 వేల ఆర్థిక సహాయం..
ఆకేరు న్యూస్, ములుగు:
ఇటీవల రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతున్న ములుగు జిల్లా దళిత కాంగ్రెస్ మాజీ అధ్యక్షులు దాసరి సుధాకర్ కు మంత్రి సీతక్క ఆదేశానుసారంతో మంత్రి వ్యక్తిగత సహాయకులు బరిగల భాస్కర్ పరామర్శించారు.
మంత్రి సీతక్క, ములుగు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు పైడాకుల అశోక్ లు అందించిన ₹50,000 చెక్కును భాస్కర్ బాధితుడు సుధాకర్ కు సోమవారం అందజేశారు.
ఆపదలో కష్టకాలంలో ఉన్న కార్యకర్తకు అండగా నిలవడమే నిజమైన నాయకత్వమని, ఆపదలో ఉన్న ప్రతి కుటుంబానికి భరోసా ఇవ్వడమే మంత్రి సీతక్క లక్ష్యమని బాస్కర్ తెలిపారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
