Revanth Reddy Court Appearance
* నాంపల్లి కోర్టుకు సీఎం రేవంత్ రెడ్డి
* నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార కేసు..
* కోవిడ్ కేసులో హాజరు
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) నాంపల్లిలోని ప్రజాప్రతినిధుల ప్రత్యేక కోర్టుకు హాజరయ్యారు. 2021లో నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచార సమయంలో కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించారనే ఆరోపణలతో ఆయనతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులపై నమోదైన కేసు విచారణలో భాగంగా కోర్టుకు వచ్చారు. 2021 ఏప్రిల్ 11న నాగార్జునసాగర్ ఉప ఎన్నికల ప్రచారంలో రేవంత్ రెడ్డి, ఇతర కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు. ఆ సమయంలో కరోనా వ్యాప్తి నేపథ్యంలో అమల్లో ఉన్న నిబంధనలను పాటించలేదని, మాస్కులు ధరించకుండా ప్రచార కార్యక్రమాల్లో పాల్గొన్నారని ఆరోపణలు వచ్చాయి. ఈ వ్యవహారంపై రేవంత్ రెడ్డితో పాటు ఇతర కాంగ్రెస్ నాయకులపై కేసు నమోదైంది. ఈ కేసుకు సంబంధించిన విచారణలో భాగంగా రేవంత్ రెడ్డి నాంపల్లి ప్రజాప్రతినిధుల కోర్టుకు హాజరయ్యారు. కేసు తదుపరి విచారణ, కోర్టు ఆదేశాలకు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.

