minister Seethakka Environment Day Plantation mulugu
* మొక్కలు నాటుదాం.. ప్రాణవాయువు అందిద్దాం.
– రాష్ట్ర మంత్రి సీతక్క.
ఆకేరు న్యూస్, ములుగు:
పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత, విరివిగా మొక్కలు నాటుదాం ప్రాణవాయువు అందిద్దాం అంటూ రాష్ట్ర మంత్రి సీతక్క పిలుపునిచ్చారు.
99 రోజుల ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా శుక్రవారం ములుగు జిల్లా ఇంచర్ల ఏకో పార్క్‌లో నిర్వహించిన కార్యక్రమానికి రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, గ్రామీణ నీటి సరఫరా, మహిళా శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క,ముఖ్య అటవీ సంరక్షణాధికారి కాళేశ్వరం జోన్ బి.ప్రభాకర్ ఐఎఫ్ఎస్ తో కలిసి ముఖ్య అతిథిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మంత్రి సీతక్క, సి సి ఫ్ , జిల్లా కలెక్టర్ , ఎస్పీ ,ఇంచర్ల సర్పంచ్ కుమార్ గౌడ్ తదితరులు మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటారు.
అనంతరం అటవీ శాఖ ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను సందర్శించి, అటవీ సంపద సంరక్షణ, జీవ వైవిధ్యం పరిరక్షణ, వన్యప్రాణుల రక్షణకు సంబంధించిన చిత్రాలను పరిశీలించారు.
ఈ కార్యక్రమంలో ఐటిడిఏ పిఓ లెనిన్ వస్సల్ టోప్పో, పంచాయతీ రాజ్ డైరెక్టర్ బైరెడ్డి భగవాన్ రెడ్డి,ఇంచర్ల ఉప సర్పంచ్, స్థానిక ప్రజాప్రతినిధులు,అటవీ శాఖ అధికారులు, సంబంధిత అధికారులు, తదితరులు, పాల్గొన్నారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
