* ములుగు మున్సిపల్ బిల్లును ఆమోదించండి
* గవర్నర్కు విన్నవించిన మంత్రి
ఆకేరు న్యూస్, హైదరాబాద్: గవర్నర్ జిష్ణుదేవ్ వర్మతో మంత్రి సీతక్క మంగళవారం భేటీ అయ్యారు. ములుగు మున్సిపాలిటీ బిల్లును తక్షణం ఆమోదించాలని మంత్రి.. గవర్నర్ను కోరారు. గత ప్రభుత్వ హయాంలోనే దీనిని మున్సిపాలిటీగా చేశారని గుర్తు చేశారు. ఈ సందర్భంగా ములుగు గ్రామపంచాయతీని మున్సిపాలిటీగా మారుస్తూ 2022లో అసెంబ్లీ పాస్ చేసిన బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని గవర్నర్కు సీతక్క వినతిపత్రం అందజేశారు. గత ప్రభుత్వ తప్పిదాలతో మున్సిపాలిటీకి ములుగు నోచుకోని పరిస్థితి. తెలంగాణ మున్సిపల్ చట్ట సవరణ బిల్లులోనే ములుగు మున్సిపాలిటీ అంశాన్ని గత ప్రభుత్వం చేర్చింది. సాంకేతికపరమైన చిక్కులతో ములుగు మున్సిపాలిటీ బిల్లు ఇంతకాలం పెండిరగ్లోనే ఉండిపోయిన విషయం తెలిసిందే. అదే బిల్లులో జీహెచ్ఎంసీ చట్టానికి సవరణలు ప్రతిపాదించింది గత సర్కార్. దీంతో ములుగు మున్సిపాలిటీ బిల్లు గందరగోళంగా మారిపోయింది. సభ్యుల గందరగోళం నడుమ 2022లో బిల్లును అప్పటి ప్రభుత్వం పాస్ చేసింది. అయితే న్యాయపరమైన, సాంకేతికపరమైన అంశాల నేపథ్యంలో బిల్లును గత గవర్నర్ తమిళి సై సౌందర్ రాజన్ రాష్ట్రపతి ఆమోదానికి పంపించారు. దీంతో ములుగు మున్సిపాలిటీ బిల్లు పెండిరగ్లోనే ఉండిపోయింది. ఈ క్రమంలో బిల్లు వివరాలు గవర్నర్కు అందజేసిన మంత్రి సీతక్క.. ములుగుకు మున్సిపాలిటీ హోదా కల్పించే బిల్లుకు ఆమోద ముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు.
…………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
