
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ కుమార్తె(Kcr Daughter), ఎమ్మెల్సీ కవిత(Mlc Kavitha) హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఈరోజు ఉదయం వైద్య పరీక్షల నిమిత్తం ఆమె ఆస్పత్రికి వచ్చారు. వైద్యుల సూచన మేరకు ఆస్పత్రిలో చేరారు. ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ కేసులో తిహార్ జైలులో ఉన్న సమయంలో గైనిక్ సమస్యలు, తీవ్ర జ్వరంతో ఆమె అనారోగ్యానికి గురయ్యారు. బ్లడ్ ప్లజర్తో బాధపడ్డారు. ఢిల్లీలో ఎయిమ్స్(Delhi Amis)లో గతంలో వైద్య పరీక్షలు చేసుకున్నారు. ఇప్పుడు మరోసారి హైదరాబాద్లోని ప్రముఖ ఆస్పత్రిలో చేరారు. వైద్య పరీక్షల అనంతరం సాయంత్రానికి డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు.
…………………………