Jobs
* 130 పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం
ఆకేరు న్యూస్, డెస్క్: తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (TGPSC), హైదరాబాద్ మెట్రోపాలిటన్ వాటర్ సప్లై అండ్ సీవరేజ్ బోర్డ్ (HMWSSB)లో మేనేజర్ (ఇంజినీరింగ్) పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మల్టీ జోన్–II పరిధిలో మొత్తం 130 పోస్టులను భర్తీ చేయనున్నారు.
నోటిఫికేషన్ నంబర్ 04/OG/HM/2026గా జారీ అయింది. ఆన్లైన్ దరఖాస్తులు సెప్టెంబర్ 23, 2026 నుంచి ప్రారంభమై అక్టోబర్ 17, 2026 సాయంత్రం 5 గంటల వరకు స్వీకరిస్తారు.
విద్యార్హత
అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి సంబంధిత విభాగంలో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులై ఉండాలి. సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్ ఇంజినీరింగ్లో అర్హత ఉన్నవారు దరఖాస్తు చేసుకోవచ్చు.
వయోపరిమితి
2026 జూలై 1 నాటికి 18 నుంచి 44 ఏళ్ల మధ్య వయసు ఉండాలి. నిబంధనల ప్రకారం రిజర్వేషన్ వర్గాలకు గరిష్ఠ వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.
ఎంపిక విధానం
అభ్యర్థుల ఎంపిక ఆబ్జెక్టివ్ టైప్ పరీక్ష ద్వారా ఉంటుంది. పరీక్షను CBRT లేదా OMR విధానంలో నిర్వహించే అవకాశం ఉంది. పరీక్షను తాత్కాలికంగా డిసెంబర్ 2026లో నిర్వహించాలని TGPSC ప్రణాళిక రూపొందించింది.
జీతం
ఎంపికైన అభ్యర్థులకు రూ.54,220–రూ.1,33,630 పే స్కేల్లో జీతం లభిస్తుంది.
అభ్యర్థులు దరఖాస్తు చేసుకునే ముందు అధికారిక నోటిఫికేషన్లోని విద్యార్హతలు, వయోపరిమితి, రిజర్వేషన్లు, ఫీజు, పరీక్ష విధానం, ఇతర నిబంధనలను పూర్తిగా పరిశీలించాలి.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
