Mumbai Fire Accident
* ఫర్నిచర్ గోడౌన్లో ఎగిసిపడుతున్న మంటలు
ఆకేరు న్యూస్, డెస్క్ : ముంబైలో భారీ అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. ఓ ఫర్నిచర్ గోడౌన్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. క్షణాల్లోనే మంటలు గోడౌన్ అంతటా వ్యాపించడంతో భారీగా పొగలు కమ్ముకున్నాయి. మంటలు పెద్ద ఎత్తున ఎగిసిపడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు.
ఈ ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైనట్లు సమాచారం. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం సమీపంలోని ఆస్పత్రికి తరలించినట్లు తెలుస్తోంది. ప్రమాద సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనాస్థలికి చేరుకున్నారు.
ప్రస్తుతం ఆరు ఫైరింజన్లతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు అగ్నిమాపక సిబ్బంది తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటల తీవ్రత ఎక్కువగా ఉండటంతో సహాయక చర్యలను అప్రమత్తంగా కొనసాగిస్తున్నారు. అగ్నిప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.
గోడౌన్లో భారీగా ఫర్నిచర్ ఉండటంతో ఆస్తి నష్టం కూడా గణనీయంగా ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు, గాయపడిన వారి పరిస్థితి, ఆస్తి నష్టం తదితర వివరాలు అధికారికంగా వెల్లడికావాల్సి ఉంది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
