Telangana Builders Pending Bills
* ఆంధ్ర కాంట్రాక్టర్స్ బిల్లులు క్లియర్ అవుతున్న… మరి తెలంగాణ బిల్డర్స్ బిల్లులు ఎందుకు క్లియర్ కావడం లే?
* తెలంగాణ బిల్డర్స్ మండిపాటు
* రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనకు పిలుపు
* తెలంగాణ ప్రభుత్వానికి కాంట్రాక్టర్లు శత్రువులు కాదు.. అభివృద్ధిలో భాగస్వాములమే
అకేరు న్యూస్ హనుమకొండ: గతంలో పని చేసిన కాంట్రాక్టు పనులు సంబంధించి లక్షల కోట్ల బిల్లులు పెండింగ్ లో ఉన్న బిల్లులు చెల్లించాలంటూ ఈ నెల 18న తెలంగాణ రాష్ట్ర బిల్డర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహాసభలు నిర్వహించడం జరుగుతుందని బిల్డర్స్ అసోసియేషన్ నాయకులు అన్నారు. హనుమకొండ బాలసముద్రంలోని గ్రేటర్ వరంగల్ ప్రెస్ క్లబ్లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (బిఏఐ) వేముల సత్యమూర్తి, మాజీ స్టేట్ చైర్మన్ బి.సుగుణాకర్ రావు, మాజీ స్టేట్ చైర్మన్ కట్కూరి దేవేందర్ రెడ్డి, మాజీ స్టేట్ చైర్మన్ యు.సురేందర్, స్టేట్ అడ్వైజర్ కే.ప్రభాకర్ రెడ్డి, జనగాం సెంటర్ ఫాస్ట్ చైర్మన్ ఇమ్మడి దేవేందర్ రెడ్డి, వరంగల్ సెంటర్ చైర్మన్ ఈ.మనోజ్, జిల్లా నాయకులు పాల్గొన్నారు.
* ఈ సందర్భంగా నేషనల్ వైస్ ప్రెసిడెంట్ బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా వేముల సత్యమూర్తి మాట్లాడుతూ..
బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా 1941 సంవత్సరంలో భారతదేశానికి స్వతంత్రం రాకముందే స్థాపించబడిన దేశంలోనే అత్యంత పురాతన ప్రతిష్టాత్మక నిర్మాణరంగా సంస్థల్లో ఒకటి. గత 80 సంవత్సరాలుగా నిర్మాణంగా అభివృద్ధికి కాంట్రాక్టర్ల హక్కుల పరిరక్షణకు దేశ మౌలిక సదుపాయాల నిర్మాణంలో కీలకపాత్ర పోషిస్తుందన్నారు. డ్రైనేజీ పనుల నుండి డ్యాముల నిర్మాణం వరకు వివిధ ప్రభుత్వ ఇంజనీరింగ్ శాఖలో పని చేస్తూ కాంట్రాక్టర్లు ప్రస్తుతం తీవ్రమైన ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని వాపోయారు. ప్రభుత్వ నుండి బిల్లులు చెల్లింపుల్లో తీవ్ర జపం చెల్లింపులపై అనిశ్చితి కారణంగా కాంట్రాక్టర్లు వారి కుటుంబాలు సంక్షోభంలో చిక్కుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని బడ్జెట్ కు అనుగుణంగా ప్రాధాన్యత గల పనులను కొనసాగించే ప్రాధాన్యత లేని పనులను నిలిపివేసి కాంట్రాక్టర్ల డిపాజిట్లు తిరిగి చెల్లించాలని పలుమార్లు ప్రభుత్వాన్ని కోరిన, ఎన్నిసార్లు జిల్లాల్లో, రాష్ట్రాల్లో వినతి పత్రాలు అందించిన ఎలాంటి ఇప్పటివరకు ఎలాంటి స్పందన లేదన్నారు. పెండింగ్లో ఉన్న కాంట్రాక్టర్ల పిల్లలను ఎటువంటి ప్రభావాలు సిఫారసులు, విపక్షా లేకుండా సీనియార్టీ ఆధారంగా చెల్లించాలని కోరారు. ముందుగా పనులు పూర్తి చేసి సంవత్సరాలుగా బిల్లుల కోసం ఎదురుచూస్తున్న కాంట్రాక్టర్లకు ప్రాధాన్యత ఇవ్వాలని, “ముందు వచ్చిన బిల్లులకు ముందు చెల్లింపు”అనే సూత్రాన్ని ప్రభుత్వం అమలు చేయాలని వేడుకున్నారు.
* ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి పలు మార్లు వినతిపత్రలు అందిచాము…
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి నాయకత్వంలో ప్రభుత్వం ఒక ఉప సంఘాన్ని ఏర్పాటు చేసినప్పటికీ కాంట్రాక్టర్ల సంఘం పలుమార్లు వినతి పత్రాలు సమర్పించిన మా అభిప్రాయాలను తగిన విధంగా పరిగణలోకి తీసుకోలేదని గుర్తు చేశారు. ఆర్థిక ఇబ్బందులు, బిల్లుల చెల్లింపులు ఆలస్యం కారణంగా అనేకమంది కాంట్రాక్టర్లు తీవ్ర మానసిక ఒత్తిడికి గురవుతున్నారని, కొందరు ఆత్మహత్యలకు పాల్పడగా, మరికొందరు గుండెపోటుకు గురవుతున్నారని, ఈ పరిస్థితి నిర్మాణ రంగ భవిష్యత్తుపై తీవ్ర ప్రభావం చూపుతోందని వారి గోడును వెళ్ళబోచుకున్నారు. కాంట్రాక్టర్లు మాత్రమే కాకుండా కాంట్రాక్టు పనులపై ఆధారపడి జీవిస్తున్న వేలాదిమంది ఉద్యోగులు, ఇంజనీర్లు, సూపర్వైజర్లు, అకౌంటెంట్లు, యంత్రాల ఆపరేటర్లు, డ్రైవర్లు, కార్మికులు, నిర్మాణ సామాగ్రి సరఫరాదారులు కూడా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. బిల్లుల చెల్లింపుల్లో జపం కారణంగా వారి జీతాలు బకాయిలు చెల్లించలేని పరిస్థితుల్లో కాంట్రాక్టర్లు ఉన్నారని అన్నారు. కాంట్రాక్టర్ల కుటుంబాలతో పాటు నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న ఉద్యోగులు, కార్మికులు, సరఫరాదారుల కుటుంబాలు కూడా ఆర్థిక సంక్షోభంలో కొరుక్కుపోయి రోడ్డున పడే పరిస్థితి నెలకొందని సూచించారు. ఇది కేవలం కాంట్రాక్టర్ల సమస్య మాత్రమే కాదని?. నిర్మాణరంగంపై ఆధారపడి జీవిస్తున్న లక్షలాదిమంది కుటుంబాల మనుగడకు సంబంధించిన అత్యంత కీలకమైన సమస్య అని ప్రభుత్వానికి గుర్తు చేశారు.
* హక్కులు కాపాడి.. సమస్యలను పరిష్కరించాలి
కాంట్రాక్టర్ల హక్కులను కాపాడేందుకు వారి సమస్యలకు శాశ్వత పరిష్కారం సాధించేందుకు బిల్డర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న కాంట్రాక్టర్లకు పిలుపునిస్తూ ఈనెల 28న హైదరాబాదులో నిర్వహించే “చలో హైదరాబాద్” కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో పాల్గొనే విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలోని కాంట్రాక్టర్లు ప్రభుత్వానికి వ్యతిరేకంకాదని, తెలంగాణ రాష్ట్ర అభివృద్ధి కార్యక్రమంలో భాగస్వామ్యమని, రోడ్లు భవనాలు సాగునీటి ప్రాజెక్టులు తాగునీటి పథకాలు ఇతర మౌలిక సదుపాయాల నిర్మాణం ద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధికి కాంట్రాక్టర్లు విశేషంగా దోహదపడుతున్నామని తెలిపారు. అందువల్ల ప్రభుత్వం కాంట్రాక్టర్లను ఆదుకునే పెండింగ్ బిల్లులను క్రమసంఖ్య ప్రకారం పారదర్శకంగా విడుదల చేసి నిర్మాణ రంగాన్నే తద్వారా తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిని కాపాడాలని విజ్ఞప్తి చేశారు.
