* మునిసిపల్ ఎన్నికలకు భారీ బందోబస్త్
* పంపిణీ కేంద్రాలను పరిశీలించిన వరంగల్ సీపీ..
ఆకేరు న్యూస్,స్టేషన్ ఘన్పూర్: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో వరంగల్ పోలీస్ కమిషనర్ ఎన్నికల ఏర్పాట్లను పరిశీలించారు. మంగళవారం ఆయన పరకాల , స్టేషన్ ఘన్పూర్ లలో పర్యటించారు. స్టేషన్ ఘన్పూర్ కేంద్రంలోని సోషల్ వెల్ఫేర్ కళాశాలలో ఏర్పాటు చేసిన పోలింగ్ సామగ్రి పంపిణీ కేంద్రాన్ని వరంగల్ పోలీస్ కమిషనర్ సన్‌ప్రీత్ సింగ్ సందర్శించారు.ఎన్నికల సామాగ్రి పంపిణీ, పోలీస్ బందోబస్త్ గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. బ్యాలెట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూమ్‌లను, ఓట్ల లెక్కింపు కేంద్రాలను అడిషనల్ కలెక్టర్ పింకేష్ కుమార్, డీసీపీ రాజమహేంద్ర నాయక్‌తో కలిసి పరిశీలించారు.లెక్కింపు ప్రక్రియ సజావుగా సాగేందుకు తీసుకోవాల్సిన భద్రతా చర్యలపై ఏసీపీ భీం శర్మకు కీలక ఆదేశాలు జారీ చేశారు.ఎన్నికల నిబంధనలు ఉల్లంఘించే వారిపై కఠినంగా వ్యవహరించాలని, రేపు జరగబోయే పోలింగ్ ప్రశాంతమైన వాతావరణంలో ముగిసేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని సీపీ సూచించారు.ఈ కార్యక్రమంలో ఏసీపీ అనంతయ్య, ఇన్స్పెక్టర్లు వేణు, శ్రీనివాస్ రెడ్డి, చంద్రమోహన్ మరియు రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.
* పోలీస్‌లు అప్రమత్తంగా ఉండాలి
పరకాల పోలింగ్ కేంద్రాన్ని సైతం సీపీ సందర్శించారు. ఈ సందర్బంగా పోలింగ్ సామగ్రి పంపిణీ జరుగుతున్న తీరుపై పోలీస్ సంబంధిత అధికారులను వివరాలను అడిగితెలుసుకున్నారు. అనంతరం ఇదే కళాశాలలో ఏర్పాటు ఎన్నిక లెక్కింపు కేంద్రాలతో పాటు, బ్యాలేట్ బాక్స్‌లను భద్రపరిచే స్ట్రాంగ్ రూంలను పోలీస్ కమిషనర్ అడిషినల్ కలెక్టర్ రవితో కలసి పరిశీలించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కింపు జరిగే కేంద్రంలో చేయాల్సిన ఏర్పాట్లపై పోలీస్ సంబంధిత రెవేన్యూ అధికారులకు పలు సూచనలు చేయగా, లెక్కింపు సజావుగా కోనసాగేందుకు తీసుకోవాల్సిన ముందస్తూ జాగ్రత్త చర్యలపై పోలీస్ కమిషనర్ పర్కాల ఏసిపి సతీస్ బాబుకు అదేశాలు జారీచేసారు. అదే విధంగా బ్యాలెట్ బాక్స్‌లను భద్రపర్చే స్ట్రాంగ్ రూంలను సైతం పోలీస్ కమిషనర్ పరిశీలించి ఏర్పాట్లను పర్యవేక్షించారు. రేపు జరిగే ఎన్నికలను సజావుగా, ప్రశాంతవంతమైన వాతవరణం నిర్వహించేందుకుగా అధికారులందరు సన్నద్దం కావాలని, ఎవరైన ఎన్నికల నియమాలను అత్రికమించకుండా జాగ్రత్త పడాలని పోలీస్ కమిషనర్ పోలీస్ అధికారులను అదేశించారు. పోలీస్ కమిషనర్ వెంట స్థానిక ఆర్డీఓ నారయణ, ఏసిపి నాగయ్య , ఇన్స్‌స్పెక్టర్లు క్రాంతి కుమార్, రంజిత్ కుమార్, ఎస్.ఐ అశోక్ కూమార్‌తో ఇతర పోలీస్, రెవెన్యూ అధికారులు, సిబ్బంది పాల్గోన్నారు.
