Published:
*కిందపడిపోయిన డీసీపీ
ఆకేరు న్యూస్, డేస్క్: తెలంగాణ డీజీపీ కార్యాలయం వద్ద బుధవారం భారీ ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ నాయకులు, కార్యకర్తలు కార్యాలయాన్ని ముట్టడించేందుకు ప్రయత్నించడంతో పరిస్థితి అదుపుతప్పింది. వివిధ డిమాండ్లతో బీజేపీ శ్రేణులు డీజీపీ ఆఫీసు వైపు దూసుకెళ్లాయి. పోలీసులు వారిని అడ్డుకోవడంతో ఇరువర్గాల మధ్య తీవ్ర ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో జరిగిన తోపులాటలో డీసీపీ శిల్పవల్లి అదుపుతప్పి కిందపడిపోయారు. పరిస్థితిని అదుపు చేసేందుకు అదనపు బలగాలను మోహరించారు. నిరసనకారులను పోలీసులు అదుపులోకి తీసుకుని స్టేషన్కు తరలిస్తున్నారు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో టెన్షన్ వాతావరణం కొనసాగుతోంది.
Report a problem with this news article
Please tell us what is wrong. Your report will be sent to the website team.
