Chiranjeevi 158 Murali Sharma
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మెగాస్టార్ చిరంజీవి 158వ సినిమా దర్శకుడు కొల్లి బాబీ. 2023 సంక్రాంతికి విడుదలై సూపర్ హిట్ గా నిలిచిన ‘వాల్తేరు వీరయ్యకు కూడా డైరెక్టర్ బాబీనే. ఈ హిట్ కాంబోలో వస్తున్నది వర్కింగ్ టైటిల్ మెగాస్టార్ 158వ సినిమా. ఇప్పటికే ఈ చిత్రం పట్ల భారీ అంచనాలు నెలకొన్నాయి. ప్రస్తుతం షూటింగ్ శరవేగంగా పూర్తి చేసే పనిలో మేకర్స్ ఉన్నారు. ఈ మూవీ నుంచి ఒక అనౌన్స్ మెంట్ వచ్చింది.
* మురళీ శర్మ ఎంట్రీ
ఈ చిత్రంలోకి ప్రముఖ నటుడు మురళీ శర్మ ను తీసుకున్నట్లు అనౌన్స్ చేశారు. ఈయన పుట్టిన రోజు ఆగస్టు 9 ఈరోజు ఈ అప్డేట్ ని అందించారు. అలాగే ఒక స్టీల్ కూడా బయటికి రిలీజ్ చేశారు. అయితే నెట్ఫ్లిక్స్ నిర్మించిన తొలి తెలుగు ఒరిజినల్ వెబ్ సిరీస్ ‘సూపర్ సుబ్బు’ ద్వారా ఓటీటీ రంగంలోకి అడుగుపెట్టారు. ఈ సిరీస్లో మురళీశర్మ పాత్రను ‘డైనోసార్’ లాగా చాలా పవర్ఫుల్గా డిజైన్ చేసినట్లు ఓ సందర్భంలో శర్మ స్వయంగా చెప్పారు.
* తెలుగు సినిమాల గురించి మురళీ ఎమన్నారంటే..
ఇటీవల ఒక ఇంటర్వ్యూలో మురళీ మాట్లాడుతూ తెలుగు సినిమా కేవలం మసాలా ఎంటర్ టైనర్లకే పరిమితం కాలేదు. సామాజిక అంశాలతో కూడిన కథలతో ముందుకు సాగుతోంది అని ఆనందాన్ని వ్యక్తం చేశారు. మెగా స్టార్ 158లో అనశ్వర రంజన్ మెగాస్టార్ కూతురిగా నటిస్తుంది. ఇక ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తున్నాడు. కే వీఎన్ ప్రొడక్షన్స్ నిర్మాణ బాధ్యతలు చేపట్టింది.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
