Akhila from Mulugu secured an NIT seat
* ఎన్ ఐ టి లో సీటు సాధించిన విద్యార్థినికి రూ.40 వేల ఆర్థిక సహాయం.
ఆకేరు న్యూస్,ములుగు:
ములుగు జిల్లాలోని ఏటూరునాగారం మండలం శంకరాజుపల్లి గ్రామానికి చెందిన అనుము అఖిల ప్రతిభతో ఎన్ఐటి కళాశాలలో సీటు సాధించడం పట్ల మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు అభినందించారు. ఉన్నత విద్య తో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఆకాంక్షిస్తూ, రాష్ట్ర యువజన కార్యదర్శి కుంజా సూర్య, కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు దేవులపల్లి అజయ్ ఆధ్వర్యంలో అఖిల విద్యాభ్యాసానికి రూ.40 వేల ఆర్థిక సహాయం అందించారు. విద్యార్థుల ప్రతిభను గుర్తించి ప్రోత్సహించడం, ఆర్థిక పరిస్థితులు వారి ఉన్నత విద్యకు అడ్డంకిగా మారకుండా అండగా నిలవడం అభినందనీయమని నాయకులు తెలిపారు. అఖిల భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదిగి గ్రామానికి, తల్లిదండ్రులకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు.ఈ కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి గుడ్ల దేవేందర్, జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కొండగొర్ల పోషయ్య, జిల్లా యువజన ఉపాధ్యక్షుడు సర్వ అక్షిత్, మండల కిసాన్ సెల్ అధ్యక్షుడు, ఆత్మ డైరెక్టర్ సోదారి రామయ్య, సర్పంచులు కావిరి అర్జున్,పొలబోయిన గోపాల్,సర్పంచ్ ఈసం జనార్దన్,ఉపసర్పంచ్ అనుము లక్ష్మయ్య, తాటి నీలాద్రి,జాడి రమేష్, సప్పిడి రాంబాబు, పొన్న వెంకటనారాయణ, చెన్న శ్రీనివాస్, అత్కూరి ఎల్లయ్య, నేతాజీ, సోదారి కుమార్,రాజేష్,తదితరులు పాల్గొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
