ఆకేరున్యూస్, హైదరాబాద్: విద్యాశాఖ ముఖ్య కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ ఎన్.శ్రీధర్‌ను ప్రభుత్వం నియమించింది. ఆయనకు పూర్తిస్థాయి అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి గురువారం ఉత్తర్వులు జారీచేశారు. విద్యాశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న బుర్రా వెంకటేశంను ప్రభుత్వం టీజీపీఎస్సీ చైర్మన్‌గా నియమించిన విషయం తెలిసిందే. దీంతో ఆయన వాలంటరీ రిటైర్మెంట్కు ప్రభుత్వం అనుమతించింది. ఈ నేపథ్యంలో వెంకటేశం స్థానంలో ఎన్.శ్రీధర్‌కు ప్రభుత్వం బాధ్యతలు అప్పగించింది. శ్రీధర్ 1997 ఐఏఎస్ బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి. ఆయన ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో పలు క్యాడర్లలో సేవలందించారు.
……………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
