* ఇక్కడ అందరికీ అందుబాటులో వైద్యసేవలు
* నిరుపేదల వైద్యానికి బసవతారకం నిధి
* నందమూరి బాలకృష్ణ
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : బసవతారకం ఆస్పత్రిలో కొత్తగా బ్రాకీ థెరపీ యూనిట్‌ను ఆస్పత్రి చైర్మన్, ప్రముఖ నటుడు నందమూరి బాలకృష్ణ ఈరోజు ప్రారంభించారు. క్యాన్సర్ డే సందర్భంగా ఆయన ఆస్పత్రిని సందర్శించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బసవతారకం ఆస్పత్రిలో అందరికీ సమానంగా వైద్య సేవలు అందుతాయని స్పష్టం చేశారు. ఇక్కడకు వచ్చిన వారికి తొలుత ధైర్యం కలిగేలా, ఓ దేవాలయానికి వచ్చామన్న భావన కల్పించేలా ఇక్కడ వైద్యులు కృషి చేయడం అభినందనీయమని చెప్పారు. తక్కువ ఖర్చుతోనే ఖరీదైన వైద్యం అందిస్తున్నామని తెలిపారు. డబ్బులు చెల్లించలేని నిరుపేదల కోసం బసవతారకం నిధి ఏర్పాటు చేశామని, దాని ద్వారా వారికి ఉచితంగా వైద్యం అందిస్తామని ఈ సందర్భంగా బాలకృష్ణ ప్రకటించారు.
…………………………………………………..
