* గ్రామసభలో మంత్రి ఉత్తమ్ హామీ
ఆకేరు న్యూస్, నారాయణపూర్ : రేషన్‌కార్డులు, ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారుల ఎంపిక కోసం రాష్ట్రవ్యాప్తంగా కాంగ్రెస్ ప్రభుత్వం(Congress Government) గ్రామసభలు నిర్వహిస్తోంది. అర్హల జాబితాను ప్రకటిస్తోంది. జాబితాలో పేర్లు లేని అర్హులైన వారి నుంచి దరఖాస్తులను స్వీకరిస్తోంది. అర్హులైన అందరికీ సంక్షేమ పథకాలు ఇస్తామని చెబుతోంది. ఈక్రమంలోనే నారాయణపూర్(Narayanapur)లో జరిగిన గ్రామసభల్లో మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి(Uthamkumar reddy), పొన్నం ప్రభాకర్(Ponnam Prabhakar) పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఉత్తమ్ మాట్లాడుతూ నారాయణపూర్ ప్రాజెక్టు(Narayanapur Project)ను త్వరలోనే పూర్తి చేస్తానని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి హామీ ఇచ్చారు. గత ప్రభుత్వం రూ. లక్షల కోట్లు ఖర్చు చేసి నామమాత్రపు ఆయకట్టును నిర్మించిందని విమర్శించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ ఆయకట్టు తేవడమే తమ విధామని వివరించారు. ముంపు గ్రామాల ప్రజలకు సరైన న్యాయం చేస్తానన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తామన్నారు.
……………………………………..
Please tell us what is wrong. Your report will be sent to the website team.
