* దిల్ రాజు బంధువుల ఇళ్లలోనూ కొనసాగుతున్న వైనం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : స్టార్ డైరెక్టర్, తాజాగా పుష్ప -2 సినిమా ద్వారా బ్రహ్మాండమైన విజయం అందుకున్న సుకుమార్(Sukumar) ఇంట్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. హైదరాబాద్లోని ఆయన నివాసంలో ఐటీ రైడ్స్(It Rides) కొనసాగుతున్నాయి. పుష్ప-2 సినిమా భారీ కలెక్షన్ల నేపథ్యంలో మేకర్స్ ఇళ్లపై రెండు రోజులుగా ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. మరోవైపు.. దిల్ రాజు ఇల్లు, కార్యాలయాల్లో సోదాలు జరుగుతున్నాయి. నిన్న దిల్ రాజు(Dil Raju) భార్యకు చెందిన లాకర్లను పరిశీలించిన అధికారులు, నేడు దిల్ రాజు కుమార్తె హన్సితారెడ్డి(Dil Raju Daughter Hansithareddy) ఇంట్లో ఐటీ సోదాలు జరిపారు. ఇంట్లో డిజిటల్ లాకర్లను ఓపెన్ చేయించారు. హన్సిత రెడ్డి సమక్షంలో లాకర్లు తెరిచారు. నిన్నటి నుంచీ జరుగుతున్న ఐటీ సోదాల్లో 55 బృందాలు పాల్గొన్నట్లు తెలిసింది.
……………………………………………
Please tell us what is wrong. Your report will be sent to the website team.
