* వ్యక్తి ప్రాణం తీసిన వివాహేతర సంబంధం
* హన్మకొండ జిల్లా సుబేదారి డీమార్ట్ ఎదురుగా వ్యక్తి దారుణ హత్య…
ఆకేరున్యూస్, హన్మకొండ: హన్మకొండ జిల్లాలో నడిరోడ్డుపై పట్టపగలే దారుణహత్య జరిగింది. వివాహేతర సంబంధమే కారణమని పోలీసులు ప్రాధమిక విచారణలో తేల్చారు. వివరాల ప్రకారం.. బొల్లికొండలో నివాసముండే మహిళతో ఆటో డ్రైవర్లు రాజ్ కుమార్, వెంకటేశ్వర్లు వివాహేతర సంబంధం పెట్టుకున్నారు. ఇదే క్రమంలో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రాజ్‌కుమార్ చేంజ్ చేసిన వెంకటేశ్వర్లు కత్తితో పొడిచి హత్య చేశాడు. మృతుడు మడికొండకు చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్ట్‌మార్టం నిమిత్తం ఎంజీఎం హాస్పిటల్‌కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
…………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
