– పనుల పురోగతి వివరాలు ఇవ్వండి
– పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ఆకేరు న్యూస్, జనగామ: రైతులకు సాగునీరు అందించడంలో అలసత్వం ఎందుకు వహిస్తున్నారని ఇరిగేషన్ అధికారులను పాలకుర్తి ఎమ్మెల్యే మామిడాల యశశ్విని రెడ్డి ప్రశ్నించారు. గురువారం పాలకుర్తి ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో ఇరిగేషన్ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పాలకుర్తి ఎమ్మెల్యే, శాసన సభ అంచనాల కమిటీ మెంబర్ మామిడాల యశస్విని రెడ్డి సాగునీటి ప్రాజెక్టుల పురోగతి, నీటి పంపకాలు, చెరువుల పునరుద్ధరణ తదితర అంశాలపై అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. అధికారులు సాగునీటి వనరుల పైన ప్రాజెక్టు పైన వివరంగా తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ రైతులకు సాగునీటి సౌకర్యం సమయానికి అందేలా చర్యలు తీసుకోవాలి. ప్రభుత్వం నిధులు మంజూరు చేసిన ప్రాజెక్టులు వేగవంతంగా పూర్తయ్యేలా చూడాలని సూచించారు. వ్యవసాయానికి జీవం లాంటి నీటి పంపకాలపై నిర్లక్ష్యం సహించబోమని హెచ్చరించారు. చెరువులు, పంప్ హౌస్లు, కాలువలు తదితర నిర్మాణ పనుల పురోగతిపై అధికారులను ప్రశ్నించారు. ఏ ప్రాంతంలో ఏ ప్రాజెక్టు ఏ దశలో ఉందో స్పష్టమైన నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. సమావేశంలో పాలకుర్తి నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఇంజినీర్లు, సిబ్బంది, పాల్గొన్నారు.
…………………………………….
