* విధి విధానాలు ఖరారు చేసిన తెలంగాణ ప్రభుత్వం
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : తెలంగాణలో కొత్త రేషన్ కార్డుల జారీకి కాంగ్రెస్ ప్రభుత్వం కసరత్తు మొదలు పెట్టింది. ఈమేరకు శనివారం సచివాలయంలో మంత్రివర్గ ఉపసంఘం సమావేశమైంది. మంత్రివర్గ ఉపసంఘం చైర్మన్ నీటిపారుదల, పౌరసరఫరాల శాఖా మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అధ్యక్షతన సమావేశం జరిగింది. ఈ సమావేశానికి మంత్రివర్గ ఉపసంఘం సభ్యులు మంత్రులు దామోదర రాజానరసింహా, పొంగులేటి శ్రీనివాసరెడ్డితో పాటు పలువురు అధికారులు హాజరయ్యారు. కొత్త రేషన్ కార్డులతో పాటు ఆరోగ్యశ్రీ కార్డుల జారీకి కేబినెట్ సబ్ కమిటీ విధి విధానాలు ఖరారు చేసింది.
విధివిధానాలు ఇవే..
* గ్రామాల్లో వార్షికాదాయం లక్షన్నర.. మాగాణి 3.50 ఎకరాలు, చెలక 7.5 ఎకరాలు
* పట్టణ ప్రాంతాల్లో వార్షికాదాయం రెండు లక్షలు
* పట్టణ ప్రాంతాల్లో భూములు కాకుండా వార్షికాదాయం అనుగుణంగా మంజూరు
* విధివిధానాల రూపకల్పనలో రాజకీయాలకు అతీతంగా ప్రజాప్రతినిధుల భాగస్వామ్యం
* లోక్సభ, రాజ్యసభ, శాసనసభ, ఎమ్మెల్సీ అందరికీ సమాచారం వెళ్లేలా చర్యలు
* సక్సేనా కమిటీ సిఫార్సుల పరిశీలన
* అంతర్రాష్ట్రాల్లో ఎక్కడైనా తెల్లకార్డు ఉంటే ఇక్కడ ఏరివేత
* దేశంలోని ఇతర ప్రాంతాల్లో విధివిధానాల పరిశీలన
—————————–