Nidigonda Satyanarayana Appointed In-Charge of Gunjedu Musalamma Temple
ఆకేరు న్యూస్, కొత్తగూడ:
మహబూబాబాద్ జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన గుంజేడు ముసలమ్మ దేవాలయానికి నూతన ఇన్చార్జ్గా నిడిగొండ సత్యనారాయణ నియమితులయ్యారు. ఈ మేరకు దేవాదాయ శాఖ అధికారులు అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు.
అదనపు బాధ్యతలుగా నియామకం…
ఇప్పటివరకు గుంజేడు ఆలయ ఇన్చార్జ్గా విధులు నిర్వహించిన అనిల్ బదిలీ కావడంతో ఈ నియామకం జరిగింది. ప్రస్తుతం శివాలయం ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఈఓ)గా సేవలు అందిస్తున్న సత్యనారాయణకు, దేవాదాయ శాఖ అధికారులు అదనపు బాధ్యతల కింద గుంజేడు శ్రీ ముసలమ్మ దేవాలయ ఇన్చార్జ్ బాధ్యతలను అప్పగించారు.
ఉత్తర్వులు అందడంతో సత్యనారాయణ గుంజేడు ఆలయ ఇన్చార్జ్గా బాధ్యతలను స్వీకరించారు. ఆలయ అభివృద్ధికి, భక్తుల సౌకర్యార్థం సేవలు అందించేందుకు తన వంతు కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
