
* బర్త్ డే వేడుకలకు దూరంగా జగ్గారెడ్డి
* పాశమైలారం ఘటన నేపధ్యంలో….
ఆకేరు న్యూస్, హైదరాబాద్ః పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ఈ ఏడాది తన పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలనే నిర్ణయం తీసుకున్నారు. పాశమైలారం సిగాచి రసాయన ఫ్యాక్టరీలో పేలుడు సంభవించి 39 మంది దుర్మరణం చెంది విషాదం మిగిల్చిన నేపధ్యంలో జగ్గారెడ్డి ఈ నిర్ణయం తీసుకున్నారు. ప్రతీ ఏడాది పార్టీ కార్యకర్తలు,అభిమానులు,అనుచరుల మధ్య అట్టహాసంగా జులై 7 న తన పుట్టినరోజు వేడుకులను జరుపుకునే జగ్గారెడ్డి ఈ సారి పుట్టినరోజు వేడుకలకు దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు. తన బర్థ్ వేడుకలు జరుపొద్దు,ఫ్లెక్సీలు పెట్టవద్దు అని పార్టీ కార్యకర్తలకు విజ్ఞప్తి చేశారు.
…………………………………….