One Nation One Election : జమిలి ఎన్నికల నిర్వహణపై మాజీ రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ అధ్యక్షతన ఏర్పాటుచేసిన కమిటీ తన నివేదికను గురువారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ముకు సమర్పించింది. జమిలీ ఎన్నికలపై రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీ కొన్ని ప్రతిపాదనలు చేసింది. ఆ నివేదికలోని అంశాలను పరిశీలిస్తే… మొదటగా లోక్‌సభ, అసెంబ్లీలకు ఒకేసారి ఎన్నికలు నిర్వహించాలని, ఆ తర్వాత వంద రోజుల వ్యవధిలో స్థానిక సంస్థలకు ఎన్నికలు నిర్వహించాలని రామ్‌నాథ్ కోవింద్ నేతృత్వంలోని ప్యానెల్ పేర్కొంది.
మొదటిసారి జరిగే జమిలీ ఎన్నికలకు, అన్ని రాష్ట్రాల అసెంబ్లీల కాల పరిమితి లోక్‌సభ ఎన్నికల తేదీ నాటికే ముగుస్తుందని నివేదికలో తెలిపారు. జమిలీ ఎన్నికలు నిర్వహించాలని కమిటీ ఏకాభిప్రాయాన్ని వ్యక్తం చేసినట్లు రిపోర్టులో పేర్కొంది. 2029 నుంచే జమిలీ ఎన్నికలు నిర్వహించాలని రిపోర్టులో సూచించారు. 1,8626 పేజీలతో నివేదికను రూపొందించారు. జమిలీ ఎన్నికల నిర్వహణ కోసం ముందస్తు ప్రణాళిక ఉండాలని, ఎన్నికలకు అవసరమైన సామగ్రి, సిబ్బంది, భద్రతా బలగాలను ముందస్తుగా మోహరించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. సింగిల్ ఎన్నికల రోల్‌ను ఎన్నికల సంఘం తయారు చేయాల్సి ఉంటుంది. ఆయా రాష్ట్రాల అధికారులతో కలిసి లోక్ సభ, అసెంబ్లీ, స్థానిక సంస్థల ఎన్నికలకు చెందిన ఓటరు ఐడీ కార్డులను రూపొందించాల్సి ఉంటుందని నివేదికలో పేర్కొంది.
1 thought on “One Nation One Election | జమిలి ఎన్నికలపై రాష్ట్రపతికి కోవింద్ కమిటీ నివేదిక.. రిపోర్టులో కీలక అంశాలు ఇవే..”