ఆకేరు న్యూస్, వరంగల్ : కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి, బీజేపీ సీనియర్ నేత బీఎస్ యడియూరప్ప (BS Yediyurappa) లైంగిక వేధింపుల కేసులో చిక్కుకున్నారు. ఓ మైనర్ బాలికపై లైంగిక వేధింపులకు పాల్పడినట్లు అభియోగంతో ఆయనపై కేసు నమోదైంది.. 17 సంవత్సరాల బాలిక తల్లి ఫిర్యాదుతో బెంగళూరులోని సదాశివనగర్ పోలీసులు పోక్సో చట్టం (POCSO Act) కింద పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాల్లోకి వెళితే… ఫిబ్రవరి 2న ఒక చీటింగ్ కేసులో సాయం కోరేందుకు తన 17 ఏళ్ల కుమార్తెతో కలిసి యడియూరప్ప వద్దకు వెళ్లామని, ఆ సమయంలో లైంగిక దాడికి గురైనట్లు బాలిక తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ విషయమై కర్ణాటక మాజీ ముఖ్యమంత్రి ఇప్పటి దాకా స్పందిచంలేదు.
లోక్సభ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ఆయనపై ఈ విధమైన ఆరోపణలు రావడం సంచలంగా మారింది. సర్వత్రా చర్చ జరుగుతోంది. ఇదిలా ఉండగా 2008-2011 మధ్య కర్ణాటక ముఖ్యమంత్రిగా పనిచేశారు. 2018లో కొద్ది రోజుల పాటు, ఆ తరువాత జూలై 2019-2021 మధ్య మరోమారు సీఎంగా పనిచేశారు. 2021 జులైలో బీజేపీ అధిష్టానం యడియూరప్పను ముఖ్యమంత్రి పదవి నుంచి తప్పించింది. ప్రస్తుతం ఆయన కుమారుడు విజయేంద్ర యడియూరప్ప రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడిగా ఉన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
