Parul Chaudhary
Parul Chaudhary| ఆకేరు న్యూస్, డెస్క్: భారత స్టార్ అథ్లెట్ పారుల్ చౌదరి ఏషియన్ గేమ్స్‌లో మరో పతకం సాధించారు. మహిళల 5000 మీటర్ల పరుగులో 15:14.61 సెకన్లలో రేసును పూర్తి చేసి కాంస్య పతకాన్ని దక్కించుకున్నారు. దీంతో ఈ ఏషియన్ గేమ్స్‌లో పారుల్ ఖాతాలో రెండో పతకం చేరింది. 5000 మీటర్ల రేసులో బహ్రెయిన్‌కు చెందిన విన్‌ఫ్రెడ్ యావి 15:10.18 సెకన్లతో స్వర్ణ పతకం సాధించగా.. జపాన్‌కు చెందిన నొజోమి తనకా 15:11.65 సెకన్లతో రజతం గెలుచుకున్నారు. పారుల్ 15:14.61 సెకన్లతో మూడో స్థానంలో నిలిచి కాంస్యం సొంతం చేసుకున్నారు.
వరుసగా రెండో పతకం
5000 మీటర్ల కాంస్య పతకానికి ఒక రోజు ముందే పారుల్ చౌదరి మహిళల 3000 మీటర్ల స్టీపుల్‌చేజ్‌లోనూ కాంస్య పతకం సాధించారు. ఈ రేసులో 9:08.67 సెకన్లలో గమ్యాన్ని చేరి జాతీయ రికార్డు నెలకొల్పారు. ఇలా వరుసగా రెండు రోజుల్లో రెండు పతకాలు సాధించి ఏషియన్ గేమ్స్‌లో తన సత్తా చాటారు. హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లోనూ రెండు పతకాలు సాధించినట్లు పారుల్ గుర్తుచేశారు.
రంగు మారింది..
రెండు పతకాలు సాధించడంపై పారుల్ చౌదరి సంతోషం వ్యక్తం చేశారు. పోటీ చాలా కఠినంగా సాగినప్పటికీ తన ప్రదర్శన పట్ల సంతృప్తిగా ఉన్నట్లు తెలిపారు. హాంగ్జౌ ఏషియన్ గేమ్స్‌లోనూ రెండు పతకాలు సాధించానని, ఈసారి పతకాల రంగు మారిందని పేర్కొన్నారు. స్వదేశానికి తిరిగి వెళ్లి కుటుంబ సభ్యులతో సమయం గడపాలని ఉందని పారుల్ తెలిపారు. దేశ ప్రజల కోసం పతకం తీసుకురావడం ఎంతో సంతోషంగా ఉందని చెప్పారు.

Please tell us what is wrong. Your report will be sent to the website team.
