AP Deputy CM Pawan Kalyan Hanamkonda Visit
* హన్మకొండ కీ ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్…
అకేరు న్యూస్ డెస్క్ : ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేనాని పవన్ కళ్యాణ్ (PAWAN KALYAN) హన్మకొండలో పర్యటించారు. ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్న తన వీరాభిమాని నిరంజన్ను పరామర్శించి, అతని కోరికను నెరవేర్చడానికి ఆయన స్వయంగా హనుమకొండలోని నిరంజన్ ఇంటికి వెళ్లారు.
హనుమకొండలోని హనుమాన్ నగర్‌కు చెందిన 17 ఏళ్ల నిరంజన్, “డుచెన్ మస్కులర్ డిస్ట్రోఫీ” అనే అరుదైన జన్యుపరమైన నరాల వ్యాధితో బాధపడుతున్నాడు. తన అభిమాన నాయకుడైన పవన్ కళ్యాణ్‌ను ఒక్కసారైనా కలవాలన్న నిరంజన్ చివరి కోరికను మన్నించి, పవన్ కళ్యాణ్ అతని ఇంటికి వెళ్లి దాదాపు 45 నిమిషాల పాటు బాలుడితో, అతని కుటుంబ సభ్యులతో గడిపారు. ఈ పర్యటన పూర్తిగా మానవతా దృక్పథంతో, అభిమాని పట్ల చూపిన ప్రేమతో సాగింది. పవన్ కళ్యాణ్ రాకతో ఆ బాలుడి కుటుంబంలో, స్థానిక జనసేన పార్టీ నాయకులలో, అభిమానులలో పెద్ద ఎత్తున హర్షం వ్యక్తమైంది.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
