* పాక్షికంగా లేఖలకు అనుమతి
* టీటీడీ ఛైర్మన్ బీఆర్ నాయుడు
ఆకేరున్యూస్, తిరుపతి: తిరుమలలో తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలను అనుమతించడంపై ఏపీ సీఎం చంద్రబాబు కీలక నిర్ణయం తీసుకున్నారు. తెలంగాణ ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీల సిఫార్సు లేఖలను అనుమతించేందుకు సీఎం చంద్రబాబు అంగీకరించారని తిరుమల తిరుపతి దేవస్థానం ఛైర్మన్ బీఆర్ నాయుడు తెలిపారు. సోమవారం సీఎంతో బీఆర్ నాయుడు సమావేశమయ్యారు. తెలంగాణ ప్రజాప్రతినిధుల సిఫార్సు లేఖలపై చంద్రబాబుతో చర్చించారు. వారానికి నాలుగు సిఫార్సు లేఖలు అనుమతించేందుకు చంద్రబాబు అంగీకరించినట్లు బీఆర్ నాయుడు తెలిపారు. వారానికి రెండు బ్రేక్ దర్శనాలు, రెండు రూ.300 దర్శనానికి సంబంధించిన లేఖలు అనుమతించేందుకు సీఎం అనుమతి ఇచ్చారని బీఆర్ నాయుడు వెల్లడిరచారు.
……………………………………….
Please tell us what is wrong. Your report will be sent to the website team.
