మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు పై చేతబడి చేశారన్న ఆరోపణలతో ఇద్దరు మంత్రుల అరెస్ట్
* మంత్రి పదవి నుంచి తొలగింపు
ఆకేరు న్యూస్ డెస్క్ : మాల్దీవులు అధ్యక్షుడు మొహ్మద్ ముయిజ్జు (Mohamed Muizzu) పై చేతబడి (Black Magic) చేశారన్న ఆరోపణలతో అదే దేశానికి చెందిన ఇద్దరు మంత్రులను పోలీసులు అరెస్ట్ చేశారు. సహాయమంత్రిగా విధులు నిర్వహిస్తున్న షమ్నాజ్ సలీం, ఆమె మాజీ భర్త అధ్యక్షుడి కార్యాలయ మంత్రి ఆదం రమీజ్ని అరెస్ట్ చేసినట్లుగా అక్కడి మీడియాలో కథనాలు వెలువడ్డాయి. అయితే ఇప్పటి వరకు పోలీసులు ఈ అరెస్ట్ ల గురించి అధికారికంగా ధ్రువీకరించలేదు. షమ్నాజ్ తో పాటు మరో ఇద్దరిని ఆదివారం అరెస్ట్ చేయగా..ఈ ముగ్గురికీ ఏడు రోజుల కస్టడీ ని విధించినట్లు సమాచారం. తాజాగా షమ్నాజ్ ను, రమీజ్ ను మంత్రి పదవి నుంచి తప్పించినట్లు సమాచారం. గతంలో ముయిజ్జు మాలే సిటీ మేయర్ గా విధులు నిర్వహించినప్పుడు సైతం షమ్నాజ్, రమీజ్ కౌన్సిలర్లుగా ఆయనతో కలిసి పని చేశారు. తాజా పరిణామాలపై మాల్దీవులు ప్రభుత్వం కానీ, అధ్యక్షుడి కార్యాలయం కానీ ఎలాంటి అధికారిక ప్రకటన వెలువరించలేదు.
————-
Please tell us what is wrong. Your report will be sent to the website team.
