Raiparthy Dargayya Nageshwar Cases
ఆకేరు న్యూస్ రాయపర్తి: ప్రొఫెసర్ నాగేశ్వర్ పై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఎత్తివేయాలని ప్రగతిశీల ప్రజా సమితి పార్టీ వ్యవస్థాపకులు రాష్ట్ర అధ్యక్షులు భూక్య దర్గయ్య నాయ క్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ జర్నలిస్టు రాజకీయ విశ్లేషకులు ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ దేశ ప్రధాని నరేంద్ర మోడీ కుమ్ముకై ప్రజల పక్షాన ప్రశ్నించే గొంతుక ప్రొఫెసర్ నాగేశ్వర్ పై ఆక్రమ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యానికి విరుద్ధ మని పేర్కొన్నారు భారత రాజ్యాంగం కల్పించిన ఓటు ద్వారా ప్రజా ప్రతినిధిగా ఎన్నికై భారత రాజ్యాంగం మీద ప్రమాణం చేసి రాజ్యాంగం యొక్క హక్కులను కాలరాస్తూ ప్రజాస్వామ్యబద్ధంగా రాజ్యాంగం ద్వారా ప్రశ్నించే హక్కును కాల రాసిన ప్రభుత్వాలు కాలగర్భములో కలిసిపోయాయని చరిత్ర చెపుతున్న సత్యాన్ని ఏపీ ప్రభుత్వం గుర్తించకపోతే రాబోయే రోజుల్లో ఏపీ ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెప్తారని హెచ్చరించారు ఇప్పటికైనా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ పై వివిధ పోలీస్ స్టేషన్ లో నమోదైన కేసులను వెంటనే రద్దుh చేయకపోతే ఆంధ్ర తెలంగాణ రాష్ట్రాలలో వామ పక్ష ప్రజాసంఘాల ప్రగతిశీల ప్రజా సమితి పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేస్తామని హెచ్చరించారు
Please tell us what is wrong. Your report will be sent to the website team.
