Preity Zinta - Family Means More Than Stardom
ఆకేరున్యూస్, హైదరాబాద్ : బాలీవుడ్ యాక్టర్ ప్రీతి జింటా అని చెప్పడం కంటే ఐపీఎల్ పంజాబ్ కింగ్ టీం యజమాని అంటే క్రీడాభిమానులు అందరికీ అర్థమవుతుంది. ఐపీఎల్ లో ఆటగాళ్లను ప్రోత్సహించే తీరుతో క్రికెట్ లవర్స్ మనసు దోచేసింది ఈ అందాల భామ.
* సెకెండ్ ఇన్సింగ్స్
ఎనిమిదేళ్ల తర్వాత సినిమాల్లోకి రీఎంట్రీ(సెకెండ్ ఇన్సింగ్స్ ) ఇస్తున్నది. 2016లో అమెరికాకు చెందిన జీన్ గూడెనఫ్ను వివాహం చేసుకుంది. అనంతరం అమెరికాలో స్థిరపడింది. 2021లో సరోగసీ ద్వారా కవల పిల్లలకు జన్మనిచ్చంది. ఇక సినిమాలు ఆపేసి కుటుంబానికి ఎక్కువ సమయం కేటాయించింది.
* 14న బత్వారా 1947 విడుదల
ఎనిమిదేళ్ల తర్వాత సిల్వర్ స్క్రీన్ మీద తనను తాను చూసుకోనుంది. ఈనెల 14 బత్వారా 1947 మూవీతో ప్రేక్షకులను అలరించనుంది.
* భర్త, పిల్లలకే ప్రాధాన్యం
ఇటీవల తన రీఎంట్రీ గురించి మీడియాతో ప్రీతి ఇలా స్పందించారు. ఫస్ట్ కుటుంబం ఆ తర్వాతే సినిమాలు అని చెప్పారు. పిల్లలను పెంచడంలో వచ్చే ఆనందం ఎందులోనూ దొరకదన్నారు. ఒక గృహిణిగా నా పిల్లలు, భర్తకే తొలి ప్రాధాన్యమని చెప్పారు. వెబ్ సిరీస్లకు ఆరు , ఎనిమిది నెలల సమయం ఇవ్వాల్సి ఉండటంతో నా పిల్లలతో గడిపే సమయాన్ని వదులకోనని స్పష్టం చేశారు. తనకు నచ్చే మెచ్చే కథలు వస్తే సినిమాలు చేస్తానన్నారు.
* భారతీయ విలువలతోనే పెంచుతున్నా
నా పిల్లలు పుట్టుకతో సగం భారతీయులు, సగం అమెరికన్లు అయితేనేం పూర్తిగా భారతీయ విలువలతోనే పెంచుతున్నానని ప్రతీ చెప్పారు. చాలా ఏళ్ల గ్యాప్ తర్వాత నటిగా ప్రేక్షకుల ముందుకు వస్తున్నానని, నా జీవితంలో స్టార్డమ్ కంటే కుటుంబ బంధాలకే ఎక్కువ విలువ ఇస్తానన్నారు.
Please tell us what is wrong. Your report will be sent to the website team.
