ఆకేరు న్యూస్ డెస్క్: జాతిపిత మహాత్మాగాంధీకి రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము(Droupadi Murmu), ప్రధాని మోదీ(Modi) నివాళులర్పించారు. గాంధీ జయంతి సందర్భంగా ఢిల్లీ(Delhi)లోని గాంధీ స్మారకం రాజ్‌ఘాట్ వద్దకు వెళ్లి మహాత్ముడికి అంజలి ఘటించారు. అంతకుముందు ఎక్స్ వేదికగా ప్రధాని ఆయనకు నివాళులర్పించారు. సత్యం, సామరస్యం, సమానత్వం అనే సిద్ధాంతాలతోనే బాపూజీ జీవితం గడిచింది. ఆయన ఆదర్శాలు దేశ ప్రజలకు ఎల్లప్పుడూ స్ఫూర్తినిస్తాయని గాంధీజీని గుర్తుచేసుకున్నారు. ఆయనతో పాటు పలువురు ప్రముఖులు రాజ్‌ఘాట్ వద్ద జాతిపితకు నివాళులర్పించారు. ఉపరాష్ట్రపతి జగ్దీప్ ధన్‌ఖడ్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, లోక్‌సభలో ప్రతిపక్ష నేత, కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ (Rahul Gandhi) ఢిల్లీ లెఫ్టినెంట్ గవర్నర్ వీకే సక్సేనా, ఢిల్లీ ముఖ్యమంత్రి ఆతిశీ తదితరులు మహాత్ముడి సేవలను స్మరించుకున్నారు.
…………………………