* శరీర భాగాలను ‘ఫ్రై’ చేసుకుని తిన్న కసాయి కొడుకు
* ఉరిశిక్ష విధించిన బాంబే హైకోర్టు
ఆకేరు న్యూస్, డెస్క్: కన్నతల్లిని చంపి ఆమె శరీర భాగాలను ‘ఫ్రై’ చేసుకుని తిన్న కసాయి కొడుకుకు కొల్హాపూర్ కోర్టు విధించిన ఉరిశిక్షను బాంబే హైకోర్టు ఖాయం చేసింది. నరమాంస భక్షణ కేసుగా గుర్తిస్తూ హైకోర్టు శిక్షను ఖరారు చేసింది. ఈ సంఘటన 2017లో జరిగింది. నిందితుడు సునీల్ కుచ్కోరవికి ఉరిశిక్షను ఖాయం చేస్తున్నామని న్యాయమూర్తులు రేవతి మొహితె, ఫృథ్వీరాజ్ చవాన్లతో కూడిన డివిజన్ బెంచ్ పేర్కొంది. ప్రాసిక్యూషన్ వాదన ప్రకారం.. ఈ హత్య కొల్హాపూర్ సిటీలో 2017 ఆగస్టు 28న జరిగింది. 63 ఏళ్ల వృద్ధురాలైన యల్లమ్మ రామ కుచ్కోరవిని సునీల్ హత్య చేసి ఆమె శరీర భాగాలను ముక్కలుగా నరికి ఫ్రై చేసుకుతిన్నాడు. మందు తాగడానికి యల్లమ్మ డబ్బులు ఇవ్వకపోవడంతో ఈ ఘాతుకానికి అతను పాల్పడగా.. ఈ కేసులో నిందితుడికి 2021లో కొల్హాపూర్ కోర్టు మరణశిక్ష విధిస్తూ తీర్పునిచ్చి వెంటనే ఎరవాడ జైలుకు (పుణె) నిందితుడిని తరలించారు. తనకు విధించిన మరణశిక్షను రద్దు చేయాలని కోరుతూ సునీల్ కుచ్కోరివి హైకోర్టులో సవాల్ చేయగా.. కోర్టు ఆయన అభ్యర్థనను తోసిపుచ్చి ఉరిశిక్ష ఖరారు చేసింది.
…………………………..