ఆకేరు న్యూస్ ,జనగామ : విద్యుత్ సరఫరాలో లోపాన్ని సరి చేసేందుకు స్తంభం ఎక్కిన తాత్కాలిక కార్మికుడు కుక్కల మల్లేష్(Kukkala Mallesh) ( 38 ) విద్యుత్ ఘాతానికి గురై మృతి చెందారు. స్థానికుల కథనం ప్రకారం జనగామ జిల్లా (Janagam district) , లింగాలఘణపురం మండలం (Lingalaghanapuram Mandal) వనపర్తి గ్రామం (Vanaparthi village) లో విద్యుత్ సరఫరాలో ఎదురవుతున్న సమస్యను పరిష్కరించేందుకు కరెంట్ పోల్ ఎక్కిన ప్రైవేట్ ఎలక్ట్రీషియన్ (Private Electrician) మల్లేశం విద్యుత్ షాక్ రావడంతో స్థభం మీదనే విలవిల్లాడుతూ మృతి చెందాడు. మృతుడికి భార్య, ఒక కూతురు, కొడుకు ఉన్నారు..
ఒకే స్తంభం మీద రెండు ఫీడర్లు
ఒకే స్తంభం మీద రెండు ఫీడర్ లు ఉన్నాయి.. ఒక ఫీడర్ కు సంబంధించిన ఎల్ సీ ( కరెంట్ కట్ ) తీసుకోవడంతో సరఫరా నిలిచిపోయిందని భావించాడంటున్నారు ..నిజానికి మరో ఫీడర్ కు సంబంధించిన విద్యుత్ సరఫరా ఇదే స్తంభం ద్వారా కొనసాగుతున్న విషయాన్ని మల్లేశం గమనించ లేక పోయాడంటున్నారు ..
కరెంట్ పోల్ మీద ఏడుగంటలు మృత దేహం
మృతుడి కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని ,నిర్లక్ష్యం గా వ్యవహరించిన విద్యుత్ అధికారులపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు.. అక్కడకు చేరుకున్న విద్యుత్ అధికారులపై దాడి చేసేందుకు ప్రయత్నించారు.. గతంలో కూడా ఇదే గ్రామంలో ఇలాంటి సంఘటనే జరిగి మహేందర్ రెడ్డి అనే వ్యక్తి మృతి చెందారు.. దీంతో గ్రామస్తులు తీవ్ర ఆగ్రహం తో ఉన్నారు..
శాంతి భద్రతల సమస్య తలెత్తకుండా జనగామ రూరల్ సీఐ శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో పెద్ద సంఖ్యలో పోలీసులు మోహరించారు..
ఆగ్రహం తో ఉన్న గ్రామస్థులు ఒక దశలో ఏడీఈ శంకరయ్య పై దాడికి దిగారు..పోలీసులు ఆయనకు రక్షణగా నిలబడి గ్రామస్థులను నిలువరించారు.. మృతుడి కుటుంబానికి తక్షణమే ఆర్థిక సాయం అందించాలని డిమాండ్ చేశారు.. దాదాపు 7 గంటల అనంతరం కరెంట్ పోల్ మీద నుంచి మృత దేహాన్ని దింపి పోస్ట్ మార్టంకు పోలీసులు పంపించారు…
————————–