* ప్రమాద సమయంలో 40 మంది ప్రయాణికులు
* పలువురికి గాయాలు
ఆకేరు న్యూస్, కర్నూలు : ఆంధ్రప్రదేశ్లోని కర్నూలు జిల్లాలో ఓ వోల్వా బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరు బాలికలు మృతి చెందారు. ప్రయాణికుల హాహాకారాలతో ఆ ప్రాంతం హోరెత్తింది. చీకట్లో సహాయం కోసం రోదించారు. అంతా నిద్రమత్తులో ఉండటం.. ఏం జరుగుతోందో అర్ధం కాని పరిస్థితిలో ప్రయాణికులు ఉండిపోయారు. హైదరాబాద్ కు చెందిన అదోని వెళ్తున్న ఓ ప్రైవేటు ట్రావెల్ బస్సు బోల్తా పడింది.ఈ ప్రమాదంలో హైదరాబాద్కు చెందిన లక్ష్మి, గోవర్ధనిగా గుర్తించారు. ప్రమాదం జరిగినప్పుడు బస్సులో 40 మందికి పైగా ప్రయాణికులు ఉన్నట్లు తెలుస్తుంది.
మిగతా ప్రయాణికులకు తీవ్ర గాయాలు కాగా.. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. బస్సు బోల్తా పడగానే.. సాయం కోసం ప్రయాణికులు హాహాకారాలు చేశారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని గ్రామస్థులతో కలిసి.. సహాయ చర్యలు చేపట్టారు. బస్సులో ఇరుక్కుపోయిన వారందరినీ బయటికి తీశారు. జేసీబీ సాయంతో బస్సును నిలబెట్టి… గాయపడిన వారిని చికిత్స కోసం కర్నూలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పుడప్పుడే తెల్లవారుతుండటం.. బస్సు డ్రైవర్ నిద్రమత్తులోకి జారుకోవడంతోనే ఈ ప్రమాదం జరిగినట్టు తెలుస్తుంది. ప్రమాదం జరిగిన చాలా సేపు వరకూ అంబులెన్స్ రాకపోవడంతో.. గాయపడిన వారి ఆర్తనాదాలు మిన్నంటాయి.
————————