* మావోయిస్ట్‌లతో సంబంధాల పేరుతో 10 ఏళ్ళ జైలు జీవితం
* ఆరు నెలల క్రితమే నిర్దోషిగా విడుదల
* కఠిన కారాగార జీవితం అనుభవించిన సాయిబాబా
* అనారోగ్యంతో వారం రోజుల క్రితం నిమ్స్‌లో చేరిక
* శనివారం రాత్రి గుండెపోటుతో తుది శ్వాస
ఆకేరు న్యూస్, హైదరాబాద్ : మానవ హక్కుల ఉద్యమ నేత ప్రొఫెసర్ జీఎన్ సాయిబాబా శనివారం రాత్రి అనారోగ్యంతో మృతి చెందారు. ఢిల్లీ విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా పనిచేసిన సాయిబాబాకు మావోయిస్ట్ పార్టీ కార్యకలాపాలతో సంబంధాలున్నాయని పోలీస్‌లు అరెస్ట్ చేశారు. 2017లో ఆయనకు న్యాయ స్థానం యావజ్జీవ శిక్ష విధించింది. 10 ఏళ్ళ అనంతరం ఆయనను బాంబే హై కోర్టు మార్చి 5న నిర్దోషిగా విడుదల చేసింది. 90 శాతం శారీరక వైకల్యం ఉన్న ప్రొఫెసర్ సాయిబాబా కఠిన కారాగార శిక్ష అనుభవించారు. దీంతో ఆయన చాలా అనేక అనారోగ్య సమస్యలు ఎదుర్కొన్నారు. కొద్ది రోజుల క్రితం ఆయన నిమ్స్ ఆస్పత్రిలో చేరారు. శనివారం రాత్రి 9 గంటల సమయంలో అనారోగ్యంతో తుది శ్వాస విడిచారని ఆస్పత్రి అధికారులు తెలిపారు.
————————–