* 2022లో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు
ఆకేరున్యూస్, న్యూఢల్లీి: ప్రొఫెసర్ సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 2022 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. ‘తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదని జస్టిస్ ఎంఆర్ షా పేర్కొన్నారు. మానవహక్కుల ఉద్యమకారుడు, ప్రముఖ రచయిత, విద్యావేత్తగా గుర్తింపు పొందిన ఢల్లీి యూనివర్సిటీ మాజీ ప్రొఫెసర్ సాయిబాబా కన్నుమూసిన సంగతి తెలిసిందే. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన హైదరాబాద్ నిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. సాయిబాబా శనివారం రాత్రి 8.45 గంటలకు గుండెపోటుతో మరణించారని వైద్యులు ధ్రువీకరించారు. ఢల్లీి యూనివర్సిటీలో ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న సమయంలో సాయిబాబాకు మావోయిస్టులతో సంబంధాలున్నాయంటూ.. 2014లో మహారాష్ట్ర పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్టు నేపథ్యంలో 2014లో ఆయనను ఢల్లీి యూనివర్సిటీ సస్పెండ్ చేయడంతో.. 2021లో పూర్తిగా విధుల నుంచి తొలగించింది. కాగా, 90 శాతం వైకల్యంతో వీల్‌చైర్‌కే పరిమితమైన సాయిబాబా మావోయిస్టులతో సంబంధాలు పెట్టుకుని దేశద్రోహానికి పాల్పడ్డారన్న ఆరోపణపై ఆయనతో పాటు మరో ఐదుగురికి మహారాష్ట్ర, గడ్చిరోలి ట్రయల్ కోర్టు జీవిత ఖైదు విధించడంతో 2017 నుంచి నాగ్‌పూర్ జైలులోనే ఉన్నారు. అంతకుముందు కూడా ఆయన 2014 నుంచి 2016 వరకు జైలు శిక్ష అనుభవించి బెయిల్‌పై విడుదలయ్యారు. అలాగే 2017లో జీవిత ఖైదు విధించడంతో.. మళ్లీ ఆయన నాగ్‌పూర్ జైలుకు వెళ్లారు. ఈ సంవత్సరం మార్చి 6 వరకు జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మార్చి 7న నిర్దోషిగా జైలు నుంచి సాయిబాబా విడుదలయ్యారు. సాయిబాబా జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు ఇచ్చిన తీర్పును 2022 అక్టోబర్‌లో సుప్రీంకోర్టు సస్పెండ్ చేసింది. జీఎన్ సాయిబాబాతో సహా మరో అయిదుగురికి యుఏపీఏ (చట్ట వ్యతిరేక కార్యకలాపాల నిరోధక చట్టం) కింద మహారాష్ట్రలోని గడ్చిరౌలి కోర్టు విధించిన జీవిత ఖైదును రద్దు చేస్తూ బాంబే హైకోర్టు నాగపూర్ బెంచ్ శుక్రవారం తీర్పు చెప్పింది. అయితే, ఈ తీర్పును సస్పెండ్ చేస్తున్నామని, వారి విడుదలపై స్టే విధిస్తున్నామని సుప్రీం కోర్టు ప్రకటించింది. అంతేకాకుండా, తనను జైల్లో కాకుండా గృహ నిర్బంధంలో ఉంచాలని సాయిబాబా చేసిన అభ్యర్థనను కూడా సుప్రీం కోర్టు తిరస్కరించింది. ఆయన బెయిల్ కోసం దరఖాస్తు చేసుకోవాలని సూచించింది. 55 ఏళ్ల వయసులో 90శాతం శారీరక వైకల్యంతో ఉన్న సాయిబాబా, మహారాష్ట్ర ప్రభుత్వం ఆరోపిస్తున్నట్లుగా దేశానికి వ్యతిరేకంగా ఎటువంటి కార్యకలాపాలు చేపట్టలేదని సాయిబాబా న్యాయవాది బసంత్ సుప్రీంకోర్టుకు కోర్టుకు విన్నవించారు.
సాయిబాబాకు ఆలోచించే మెదడు ఉందని సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా చెబుతున్నారని, కానీ ఆయన నేరానికి పాల్పడినట్లు చూపే ఆధారాలు ఏమీ లేవని బసంత్ తెలిపారు. దీని మీద స్పందిస్తూ ‘తీవ్రవాద, మావోయిస్టు కార్యకలాపాలకు సంబంధించి మెదడే ఎక్కువ ప్రమాదకరమైనది. ప్రత్యక్షంగా పాల్గొనాల్సిన పని లేదు’ అని జస్టిస్ ఎంఆర్ షా అన్నారు. ఈ మాటను తాను ఈ నిర్దిష్టమైన కేసును దృష్టిలో పెట్టుకుని అనడం లేదని కూడా షా చెప్పారు. గృహ నిర్బంధంలో ఉంచాలని సాయి బాబా న్యాయవాది చేసిన విన్నపాన్ని కూడా తుషార్ మెహతా వ్యతిరేకించారు. ఇటీవల కాలంలో గృహ నిర్బంధం కావాలంటూ ‘అర్బన్ నక్సల్స్’ అడగడం పరిపాటి అవుతోంది అంటూ ఎస్జీ కోర్టుకు తెలిపారు. ‘వాస్తవాలు చాలా ఆందోళన కలిగించే విధంగా ఉన్నాయి. జమ్మూ కశ్మీర్లో ఆయుధాల కోసం పిలుపు ఇవ్వడం, పార్లమెంటును కూల్చడానికి మద్దతు తెలపడం, నక్సలైట్లతో సమావేశాలు ఏర్పాటు చేయడం, భద్రతా దళాల మీద దాడులు చేయడం వంటివి ఇందులో ఉన్నాయి’ అని సొలిసిటర్ జనరల్ కోర్టుకు చెప్పారు.
………………………………………………….